Homeక్రీడలుక్రికెట్‌Pakistan T20 World Cup winning strategy: పాక్ టీ 20 వరల్డ్ కప్ గెలవాలంటే...

Pakistan T20 World Cup winning strategy: పాక్ టీ 20 వరల్డ్ కప్ గెలవాలంటే ఇదొక్కటే మార్గం

Pakistan T20 World Cup winning strategy: 2007లో ఐసీసీ t20 వరల్డ్ కప్ ను తెరమీదకి తీసుకొచ్చింది. నాడు జరిగిన టోర్నీలో టీమిండియా విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ మీద ఉత్కంఠ భరితంగా విజయం సాధించి.. ట్రోఫీ అందుకుంది. 2009 ఎడిషన్ లో పాకిస్తాన్ టి20 వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకు పాకిస్తాన్ జట్టు టి20 వరల్డ్ కప్ అందుకోలేదు. 2009 తొమ్మిది తర్వాత ఆ స్థాయిలో ప్రదర్శన పాకిస్తాన్ జట్టు […]

Pakistan T20 World Cup winning strategy: 2007లో ఐసీసీ t20 వరల్డ్ కప్ ను తెరమీదకి తీసుకొచ్చింది. నాడు జరిగిన టోర్నీలో టీమిండియా విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ మీద ఉత్కంఠ భరితంగా విజయం సాధించి.. ట్రోఫీ అందుకుంది.

2009 ఎడిషన్ లో పాకిస్తాన్ టి20 వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకు పాకిస్తాన్ జట్టు టి20 వరల్డ్ కప్ అందుకోలేదు. 2009 తొమ్మిది తర్వాత ఆ స్థాయిలో ప్రదర్శన పాకిస్తాన్ జట్టు ఎప్పుడు కూడా చేయలేకపోయింది. పాకిస్తాన్ జట్టు స్థిరమైన ఆట తీరు కొనసాగించకపోవడం వల్ల.. విజేతగా నిలవ లేకపోయింది.

పాకిస్తాన్ జట్టు స్థిరమైన ఆట తీరును కొనసాగించలేకపోయినప్పటికీ నిత్యం టీమ్ ఇండియా మీద ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. అడ్డ గోలుగా మాట్లాడుతూనే ఉంటుంది. ఆటగాళ్లలో క్రమశిక్షణ ఉండదు. మేనేజ్మెంట్ కు ఒక విధానం అంటూ ఉండదు. ఇక జట్టు కూ ర్పు విషయంలో ఒక పద్ధతి అంటూ ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లోపాలు ఉన్నాయి. కానీ ఆ లోపాలను అధిగమించే ప్రయత్నాన్ని పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎప్పటికీ చేపట్టదు. దీనివల్ల పాకిస్తాన్ క్రికెట్ జట్టు నష్టపోతూనే ఉంది. ప్రపంచ వేదికల ముందు పరువు తీసుకుంటూనే ఉంది.

గత టి20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశ నుంచే పాకిస్తాన్ ఇంటి బాట పట్టింది. అమెరికా చేతిలో ఓడిపోయింది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశలో ఇంటికి వచ్చింది.. పాకిస్తాన్ జట్టు సరైన సమయంలో సరైన తీరుగా ఆడక పోవడం వల్ల తీవ్రంగా నష్టపోతోంది.

టీమిండియా ఇప్పటికే t20 ఫార్మాట్లో మూడు వరల్డ్ కప్ లు అందుకుంది. 2007లో తొలి వరల్డ్ కప్ అందుకున్న టీమిండియా.. 2024లో, 2026 లో టి20 వరల్డ్ కప్ లు సాధించింది. టీమిండియా వరుసగా రెండుసార్లు టి20 వరల్డ్ కప్ లు అందుకొని చరిత్ర సృష్టించింది.. టి20 వరల్డ్ కప్ చరిత్రలో మూడుసార్లు ట్రోఫీలు అందుకొని సరికొత్త ఘనతను సాధించింది. వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లను అధిగమించి ఈ జాబితాలో తొలి స్థానాన్ని ఆక్రమించింది.

ఇండియా వరుసగా టి20 వరల్డ్ కప్ లు గెలిచిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో విస్తృతంగా సర్కులేట్ అవుతోంది. టీమిండియా మీద ఏడుపు ఏడుస్తున్న పాకిస్తాన్ జట్టు టి20 వరల్డ్ కప్ సాధించాలంటే.. ఇదే మార్గమని కొంతమంది ఒక వీడియో రూపొందించి సోషల్ మీడియాలో వదిలారు. ఆ వీడియో ప్రకారం ఒక వెల్డింగ్ షాప్ లో ఒక వ్యక్తి టి20 ప్రపంచ కప్ ఆకృతిని రూపొందించాడు. పాకిస్తాన్ జట్టు టి20 వరల్డ్ కప్ గెలవాలంటే ఇంతకు మించిన మార్గం లేదని ఆ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తులు పేర్కొన్నారు. ఈ వీడియో కాస్త లక్షలలో వీక్షణలను సొంతం చేసుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Minhajul (@82xmcg)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper