Mustafizur Rahman Replacement బీసీసీఐ(BCCI) ఆదేశాల మేరకు ఐపీఎల్లో(IPL 2026) బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్(Mustafizur Rahman) ను కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) యాజమాన్యం విడుదల చేసింది. ఈ వ్యవహారం కాస్త చినికి చినికి గాలి వాన మాదిరిగా అయిపోయింది. చివరికి టి20 వరల్డ్ కప్ లో తాము ఆడే మ్యాచ్ లు శ్రీలంక వేదికగా నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు icc దృష్టికి తీసుకెళ్లింది. అయితే దీనిపై ఐసీసీ ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
ముస్తాఫిజూర్ ను విడుదల చేసిన తర్వాత కోల్ కతా యాజమాన్యం ఎవరిని జట్టులోకి తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది . భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ బోర్డు ముస్తాఫిజుర్ ను విడుదల చేయాలని కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యానికి సూచించింది. దీంతో ఆ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అతని స్థానంలో మరొక ఆటగాడిని తీసుకోవడానికి అనుమతి ఇస్తామని బీసీసీఐ ఇప్పటికే చెప్పింది.
ఈ నేపథ్యంలో కోల్ కతా యాజమాన్యం మదిలో దాదాపు ఐదుగురు ఆటగాళ్లు ఉన్నారు. అందులో జానన్ బెరెన్ డార్ఫ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అతడి తర్వాత ఫజల్ హాక్ ఫారుకి, స్పెన్సర్ జాన్సన్, ఉమేష్ యాదవ్, అల్టారి జోసెఫ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
జాసన్
జాసన్ ఆస్ట్రేలియా జట్టులో ఫాస్ట్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఇతడిని తీసుకోవడానికి కోల్ కతా యాజమాన్యం అత్యంత ఆసక్తికరంగా ఉంది . ఇతడు బిగ్ బాష్ లీగ్ లో మెల్బోర్న్ రెనేగేడ్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. గతంలో ఇతడు చెన్నై, బెంగళూరు, ముంబై జట్లకు ఆడాడు. వన్ పాయింట్ ఫైవ్ కోట్లతో వేలంలోకి వచ్చినప్పటికీ ఇతడిని ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు
ఫారుకీ
ఆఫ్గనిస్తాన్ పేస్ బౌలర్ ఫారుకీ పేరును కూడా కోల్ కతా జట్టు పరిశీలనలోకి తీసుకుంది. ఇతడు కూడా ముస్తాఫిజర్ మాదిరిగానే ప్రభావం చూపిస్తాడు ఇటీవల యూఏఈ తో జరిగిన అంతర్జాతీయ లీగ్ టి20 లో ఒక మ్యాచ్లో 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ లో మాత్రం ఇతడు ఇంతవరకు సత్తా చూపించలేకపోయాడు. 12 మ్యాచ్లు ఆడినప్పటికీ ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు.
జాన్సన్
ఆస్ట్రేలియా జట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ ఇతడు. ఇతడి మీద కూడా షారుక్ ఖాన్ జట్టు ఫోకస్ పెట్టింది. కోల్ కతా జట్టు గురించి, ఇక్కడి వాతావరణం గురించి ఇతడికి పూర్తిగా తెలుసు. గత సీజన్లో ఇతడు కోల్ కతా జట్టు తరఫున ఆడాడు. అయితే ఇతడు ప్రస్తుతం వెన్నునొప్పి గాయానికి చికిత్స చేయించుకుని కోలుకున్నాడు. ఇతడు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని గనుక సంపాదించుకుంటే కోల్ కతా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది.
ఉమేష్ యాదవ్
గతంలో ఉమేష్ యాదవ్ కోల్ కతా జట్టు తరఫున ఆడాడు. 2014లో గంభీర్ ఆధ్వర్యంలో టైటిల్ సాధించిన కోల్ కతా జట్టులో ఇతడికి కీలక సభ్యుడు. 2022లో కోల్ కతా జట్టు తరుపున 12 మ్యాచ్లు ఆడి 16 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇటీవల మినీ వేలంలో 1.5 కోట్లతో బేస్ ధరతో అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఇతడిని ఏ యాజమాన్యం కూడా తీసుకోలేదు.
జోసెఫ్
వెస్టిండీస్ జాతీయ జట్టులో ఫాస్ట్ బౌలర్. బ్రావో కోల్ కతా జట్టుకు మెంటర్ గా ఉన్నాడు. ఒకవేళ బ్రావో కనుక కోరితే కచ్చితంగా జోసెఫ్ షారుక్ ఖాన్ జట్టులో ఉంటాడు. ఐపీఎల్ లో ఇతడు అత్యుత్తమ బౌలింగ్ చేశాడు. ఐపీఎల్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే ముంబై జట్టు తరుపున అద్భుతం సృష్టించాడు. హైదరాబాద్ జట్టు తో జరిగిన మ్యాచ్లో 3.4 ఓవర్ల పాటు బౌలింగ్ వేసి.. 12 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఆరు వికెట్లు పడగొట్టాడు.