Shardul Thakur : మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కాబోతుంది. మొత్తం 10 జట్లు ఈ లీగ్‌లో పాల్గొననున్నాయి. అయితే ఐపీఎల్ సీజన్‌కి ముందు మెగా వేలం నిర్వహిస్తారు. ఇందులో ఆటగాళ్లను కొనుగోలు చేస్తారు. ఇలా కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఒక ఫ్రాంచైజీ నుంచి ఆడుతారు. అయితే ఈ ఐపీఎల్ మెగా వేలంలో భారత్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. దీంతో ఇతను ఉండిపోయాడు. అయితే ఇప్పుడు శార్దూల్ ఠాకూర్‌కి గోల్డెన్ ఛాన్స్ వచ్చినట్లే. ఎందుకంటే మెగా వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదు. కానీ ఈ ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. శార్దల్ క్రికెట్‌లో తన సత్తా ఏంటో చూపించాడు. ఈ కారణంగానే లక్నో జట్టులో తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కీలక ప్లేయర్లు ముగ్గురు గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. వీరిస్థానంలో శార్దూల్‌ను తీసుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మయాంక్ యాదవ్, మెహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్ వంటి మెయిన్ పేసర్లు గాయపడ్డారు. ఈ క్రమంలోనే శార్దూల్‌కి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు ప్రస్తుతం శార్దూల్ శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్ జెర్సీ ధరించి శిక్షణ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Also Read : ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్లు ఔట్
ఐపీఎల్‌లో శార్దూల్ ఠాకూర్ అనేక జట్లు తరఫున నుంచి ఆడాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ వంటి వాటితో ఆడాడు. ఇప్పుడు లక్నో జట్టులో ఆడనున్నాడు. అయితే గతంలో ఐపీఎల్ సీజన్‌లో శార్దూల్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. అప్పుడు ఆ సీజన్‌లో పెద్దగా రాణించలేదు. ఈ సీజన్‌లో కేవలం 9 మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. బ్యాటింగ్ కూడా పెద్దగా చేయలేదు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ శార్దూల్‌ను తీసుకోలేదు. దీంతో లక్నో జట్టులో అవకాశం వచ్చేలా తెలుస్తుంది. వీరితో పాటు మిచెల్ మార్ష్ కూడా వెన్ను గాయం కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం అందుబాటులో లేడు. ఈ కారణం వల్ల శార్దూల్‌ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.
ఈ ఏడాది ఐపీఎల్ 2025 మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు 10 జట్లు ఆడనున్నాయి. మొత్తం 65 రోజుల పాటు ఐపీఎల్ 18వ సీజన్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లు మొత్తం 11 వేదికల్లో జరగనుంది. అలాగే రాజస్థాన్ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు, అస్సాంలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వైజాగ్ స్టేడియంలో రెండు హోమ్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలుస్తోంది. మిగతా మ్యాచ్‌లు ఢిల్లీలో జరుగుతాయి.ఫైనల్ మ్యాచ్ మే 25న ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది.
Also Read : మిగతా జట్ల లాగా.. SRH కు కూడా కెప్టెన్ ను మార్చేస్తే..