IPL Trophy 2025
IPL Trophy 2025 : ట్రోఫీ కోసం బరిలో ఉన్న పది జట్లు అత్యంత బలంగా కనిపిస్తున్నాయి.. గతంలో పంజాబ్, ఢిల్లీ, లక్నో అంత బలంగా ఉండేవి కాదు. కానీ గత ఏడాది జరిగిన మెగా వేలంలో ఈ మూడు జట్లు కీలకమైన ప్లేయర్లను కొనుగోలు చేశాయి. తమ పర్స్ వాల్యూ లో ఉన్న నగదును ఎక్కువగా ఖర్చు పెట్టాయి. లక్నో జట్టుకు రిషబ్ పంత్, పంజాబ్ జట్టుకు శ్రేయస్ అయ్యర్, ఢిల్లీ జట్టుకు అక్షర్ పటేల్ నాయకత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ఈ మూడు జట్లు గతంలో కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్ నాయకత్వం వహించేవారు. అయితే వారి ముగ్గురిని ఆయా జట్లు వేలంలో రిటైన్ చేసుకోకపోవడంతో.. మిగతా జట్లు భారీ ధరకు కొనుగోలు చేశాయి. గత సీజన్లో లక్నో జట్టు యజమానికి, కేఎల్ రాహుల్ గొడవ జరిగింది. దీంతో రాహుల్ లక్నో జట్టు నుంచి బయటికి వచ్చాడు . ఆ తర్వాత అతడిని ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది. ఢిల్లీ జట్టుకు కేఎల్ రాహుల్ ను కెప్టెన్ ను చేస్తారని ప్రచారం జరిగింది. కాకపోతే ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో కెల్ రాహుల్.. తన బ్యాటింగ్ ను మరింత మెరుగుపరచుకునేందుకు కృషి చేస్తున్నాడు. దీంతో అతడు కెప్టెన్సీ తీసుకోవాలని ఢిల్లీ యాజమాన్యంతో చెప్పాడు. దీంతో ఢిల్లీ యాజమాన్యం శుక్రవారం అక్షర్ పటేల్ కు జట్టు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటికే ముంబై జట్టుకు హార్దిక్, కోల్ కతా కు వెంకటేష్ అయ్యర్, ఢిల్లీకి అక్షర్, ముంబైకి హార్దిక్, గుజరాత్ కు గిల్, లక్నోకు రిషబ్ పంత్, రాజస్థాన్ జట్టుకు సంజు శాంసన్, పంజాబ్ కు శ్రేయస్ అయ్యర్, బెంగళూరుకు రజత్ పాటిదార్, చెన్నైకి రుతు రాజ్ గైక్వాడ్ నాయకత్వం వహిస్తున్నారు. అయితే హైదరాబాద్ జట్టుకు మాత్రం కమిన్స్ నాయకత్వం వహిస్తున్నాడు.
Also Read : గత ఏడాది ఫైనల్లోకి.. ఈ ఏడాది SRH పరిస్థితి ఏంటో.. జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయంటే..
కెప్టెన్ ను మార్చేస్తే..
ఐపీఎల్ లో తొమ్మిది జట్లకు స్వదేశీ ఆటగాళ్లు కెప్టెన్లు గా వ్యవరిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టుకు కూడా స్వదేశీ ఆటగాడిని కెప్టెన్ చేయాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. గత సీజన్లో హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన కమిన్స్.. ఏకంగా ఫైనల్ దాకా తీసుకెళ్లాడు.. ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా చేతిలో హైదరాబాద్ ఓడిపోయినప్పటికీ.. అభిమానుల మనసు గెలుచుకుంది. ఇప్పుడు ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు బలంగా కనిపిస్తోంది. కమిన్స్ నాయకత్వాన్ని హైదరాబాద్ మేనేజ్మెంట్ బలంగా నమ్ముతోంది. దీంతో ఈ సీజన్లో హైదరాబాద్ జటను కమిన్స్ ముందుండి నడిపిస్తాడు. ఇటీవల ఆస్ట్రేలియా చాంపియన్స్ ట్రోఫీలో ఆడినప్పుడు కమిన్స్ వ్యక్తిగత కారణాలవల్ల జట్టుకు దూరమయ్యాడు. జట్టుకు స్మిత్ నాయకత్వం వహించాడు.. అయితే ఇప్పుడు ఐపీఎల్ లో కమిన్స్ రెడీగా ఉన్నాడు.. ఒకవేళ హైదరాబాద్ జట్టుకు స్వదేశీ ఆటగాడిని కెప్టెన్ గా నియమించాల్సి వస్తే.. నితీష్ కుమార్ రెడ్డికి ఆ అవకాశం దక్కుతుందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడాడు. బౌలింగ్, బ్యాటింగ్లో సత్తా చూపించాడు.
Also Read : ఐపీఎల్ వేటకు SRH రెడీ.. కొత్త జెర్సీలో ఆటగాళ్లు ఎలా ఉన్నారంటే..