Micro Retirement
Micro Retirement: రిటైర్మెంట్ అనేది ప్రతీ ఉద్యోగి జీవితంలో కామన్. ప్రభుత్వమైనా.. ప్రైవేటు అయినా విరమణ తప్పదు. ఇందుకు కార్మిక చట్టాలు నిబంధన పెట్టాయి. రిటైర్మెంట్ వయసును నిర్ధారించాయి. అయితే ఇటీవల మైక్రో రిటైర్మెంట్(Micro Retairment) ప్రాచుర్యంలోకి వచ్చింది. మైక్రో రిటైర్మెంట్ అనేది ఉద్యోగ జీవితంలో ఇటీవల ప్రాచుర్యం పొందుతున్న ఒక కొత్త ట్రెండ్. దీని ప్రకారం, సంప్రదాయకంగా 60 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యే బదులు, ఉద్యోగులు తమ కెరీర్ మధ్యలో కొంత సమయం విరామం తీసుకుని, జీవితాన్ని ఆస్వాదించడానికి లేదా వ్యక్తిగత ఆసక్తులను అనుసరించడానికి ఎంచుకుంటారు. ఆ తర్వాత, వారు మళ్లీ ఉద్యోగంలో చేరవచ్చు లేదా వేరే కొత్త మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఈ ట్రెండ్ ముఖ్యంగా జనరేషన్ (Gen Z) ఉద్యోగులలో ఎక్కువగా కనిపిస్తోంది. వీరు మానసిక ఆరోగ్యం, వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కొవిడ్(Covid) మహమ్మారి తర్వాత ఉద్యోగ జీవితంలో చేరిన చాలా మంది యువత, సుదీర్ఘకాలం ఒత్తిడితో కూడిన ఉద్యోగాలకు బదులు, జీవితంలో విరామాలు తీసుకుని తమను తాము రిఫ్రెష్(Refresh) చేసుకోవడాన్ని ఇష్టపడుతున్నారు. కొంతమంది 2–3 సంవత్సరాలు పని చేసి డబ్బు సేవ్ చేసిన తర్వాత, ఆ సమయాన్ని ప్రయాణాలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం లేదా వ్యక్తిగత లక్ష్యాల కోసం వినియోగిస్తారు.
Also Read: 100% స్ట్రైక్ రేట్ విషయంలో పవన్ ని దాటేసిన నేచురల్ స్టార్ నాని!
సోషల్ మీడియాలో ట్రెండ్..
సోషల్ మీడియా(Social Media)లో మైక్రో రిటైర్మెంట్ విధానం ట్రెండ్ చేస్తూ మరింత విస్తరింపజేస్తోంది. టిక్‌టాక్ క్రియేటర్ అన్నాబెల్ డెనిసెంకో వంటి వారు మైక్రో రిటైర్మెంట్ తీసుకుని, ఆ సమయంలో జీవితాన్ని ఆస్వాదించడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకున్న అనుభవాలను పంచుకుంటున్నారు. అయితే, ఈ విరామ సమయాన్ని ఎంత తెలివిగా వినియోగించుకుంటామన్నది చాలా ముఖ్యం అని నిపుణులు సూచిస్తున్నారు.
కంపెనీలకు సవాళ్లు..
ఇక ఈ మైక్రో రిటైర్మెంట్ కారణంగా కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. అనుభవం, నైపుణ్యం ఉన్న ఉద్యోగులు సడెన్‌గా రాజీనామా చేయడం ద్వారా కపెనీలకు నష్టం జరుగుతోంది. ఉద్యోగులు రాజీనామా చేయడం ఎక్కువై, ఖాళీలను భర్తీ చేయడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. మొత్తంగా, మైక్రో రిటైర్మెంట్ అనేది ఆధునిక ఉద్యోగ జీవితంలో సమతుల్యత మరియు స్వేచ్ఛను కోరుకునే వారికి ఒక సృజనాత్మక పరిష్కారంగా మారుతోంది.