https://oktelugu.com/

IPL 2025 Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. ఐపీఎల్ నుంచి స్టార్ ప్లేయర్లు ఔట్

మార్చి 22వ తేదీ నుంచి మే 25 వ‌ర‌కు ఐపీఎల్ టోర్నీ జరగనుంది. ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియ‌న్ కోల్‌కతా నైట్ రైడ‌ర్స్ (Kolkata Knight Riders), రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (Royal Challangers Banglore) జ‌ట్ల మ‌ధ్య జరుగుతుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 14, 2025 / 02:35 PM IST
    IPL 2025 Mumbai Indians

    IPL 2025 Mumbai Indians

    Follow us on

    IPL 2025 Mumbai Indians: మార్చి 22వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య జరగ‌నుంది.కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. దేశంలో ఐపీఎల్‌ను ఎక్కువ మంది చూస్తుంటారు. ఈ ఐపీఎల్‌కి మంచి డిమాండ్ ఉంది. అయితే లీగ్ ప్రారంభం కాక ముందే ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టులోని స్టార్ ప్లేయర్లు మొదటి మ్యాచ్‌లకు దూరమవుతున్నారు. స్టార్ పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు కాస్త దూరంగా ఉంటాడని రిపోర్ట్‌లు చెబుతున్నాయి. ప్రస్తుతం బుమ్రా బౌలింగ్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు.

    Also Read: అయ్యగారు చాలా లేట్.. దాదాపు రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఏజెంట్

    సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బుమ్రా చికిత్స పొందుతూ ప్రాక్టీస్ చేస్తున్నాడు. పూర్తిగా నయం అయితేనే బుమ్రా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే మొదట కొన్ని మ్యాచ్‌లకు బుమ్రా హాజరు కాకపోవచ్చు. దాదాపుగా ఒక రెండు వారాల పాటు బుమ్రా మ్యాచ్‌లో ఉండటం కష్టమే. రెండు వారాల తర్వాత బుమ్రా జట్టులోకి చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే వరుసగా పాండ్యా స్టో ఓవర్ రేట్‌ను నమోదు చేశాడు. ఒక కెప్టెన్ అయి ఫస్ట్ టైమ్ స్లో ఓవర్ రేట్‌కు పాల్పడితే రూ.12 లక్షల జరిమానా విధిస్తారు. అదే రెండోసారి అయితే రూ.24 లక్షల జరిమానా విధిస్తారు. మూడోసారి కూడా ఇలానే చేస్తే కెప్టెన్‌కు రూ.30 లక్షల జరిమానా విధిస్తారు. అలాగే ఇతర ఆటగాళ్లు కూడా జరిమానా విధించడంతో పాటు ఒక మ్యాచ్ కూడా నిషేధం ఉంటుంది. అయితే హార్డిక్ కాబ‌ట్టి గ‌త సీజ‌న్ లో మూడు సార్లు స్లో ఓవ‌ర్ రేటును న‌మోదుచేసిన హార్దిక్ పై రాబోయే ఐసీఎల్ సీజ‌న్ లో ఒక మ్యాచ్ నిషేధం ఉండ‌నుంది. ఈ కారణంగానే హార్డిక్ కూడా మొదటి మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. హార్డిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ మొదటి మ్యాచ్‌కి కెప్టెన్‌గా ఉండవచ్చు.

    ఇదిలా ఉండగా మార్చి 22వ తేదీ నుంచి మే 25 వ‌ర‌కు ఐపీఎల్ టోర్నీ జరగనుంది. ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియ‌న్ కోల్‌కతా నైట్ రైడ‌ర్స్ (Kolkata Knight Riders), రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (Royal Challangers Banglore) జ‌ట్ల మ‌ధ్య జరుగుతుంది. అయితే హైదరాబాద్‌లో క్వాలిఫయర్, ఒక ఎలిమేనటర్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ 2025 మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్నట్లు సమాచారం. ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, కోల్‌కతాలో జరగనున్నాయి. అయితే ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు 10 జట్లు ఆడనున్నాయి. మొత్తం 65 రోజుల పాటు ఐపీఎల్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ల కోసం మొత్తం 11 వేదికల్లో జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో మ్యాచ్ జరగనుండటంతో క్రికెట్ ప్రేమికులకు పండగ అని చెప్పవచ్చు. ఫైనల్ మ్యాచ్ మే 25న ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. అలాగే రాజస్థాన్‌ జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఐదు మ్యాచ్‌లు, అస్సాంలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వైజాగ్‌ స్టేడియంలో రెండు హోమ్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలుస్తోంది. మిగతా మ్యాచ్‌లు ఢిల్లీలో జరుగుతాయి.

     

    Also Read: చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ఫస్ట్ హాఫ్ లాక్..ఆసక్తికరమైన టైటిల్ తో ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!