Homeక్రీడలుShubman Gill: గిల్‌ ఆట.. సారా చప్పట్ల బాట.. మళ్లీ ట్రోల్‌ అవుతున్న జంట

Shubman Gill: గిల్‌ ఆట.. సారా చప్పట్ల బాట.. మళ్లీ ట్రోల్‌ అవుతున్న జంట

Shubman Gill: స్వదేశం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ డెంగ్యూ కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌.. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో అర్థ శతకంతో సత్తా చాటాడు. 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి అవుటయ్యాడు. మెహదీ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి మహ్మదుల్లా పట్టిన సూపర్‌ క్యాచ్‌కు అవుటయ్యాడు. అయితే శుభ్‌మన్‌ గిల్‌ ఆడుతున్నంతసేపు ఓ ప్రత్యేక అతిథి చప్పట్లు కొడుతూ అతన్ని ప్రోత్సహించింది. ఫీల్డింగ్‌లో క్యాచ్‌ పట్టినప్పుడు.. బ్యాటింగ్‌లో ఫోర్లు, సిక్సర్లు కొట్టినప్పుడల్లా కేరింతలు కొడుతూ ఎంకరేజ్‌ చేసింది. గిల్‌ను అంతలా ప్రోత్సహించిన ఆ ప్రత్యేక అతిథి ఎవరంటే క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ గారాలపట్టి సారా టెండూల్కర్‌. శుభ్‌మన్‌ గిల్‌ ఫోర్లు , సిక్సులు కొట్టినప్పుడు స్టేడియంలోని సారా టెండూల్కర్‌ ఇచ్చిన రియాక్షన్‌ సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

గిల్‌ గేమ్‌ను ఎంజాయ్‌ చేస్తూ..
పూణే వేదికగా గురువారం భారత్‌–బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ చూసేందుకు క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ గారాల పట్టి సారా టెండూల్కర్‌ హాజరైంది. తన స్నేహితులతో కలిసి స్టాండ్స్‌ నుంచి సారా టెండూల్కర్‌ ఈ మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ టీమిండియాకు మద్దతు తెలిపింది. మ్యాచ్‌లో బంగ్లా బ్యాట్స్‌మెంట్‌ లిట్టన్‌దాస్‌ జడేజా బౌలింగ్‌లో లాంగ్‌–ఆన్‌లో సిక్స్‌ కొట్టేందుకు యత్నించాడు. అయితే టైమింగ్‌ మిస్‌ అయింది. దీంతో గాల్లోకి లేచిన బందిని బౌండరీ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న శుభ్‌మన్‌ గిల్‌ మంచి క్యాచ్‌ తీసుకున్నాడు. దీంతో సారా టెండూల్కర్‌ నవ్వుతూ చప్పట్లు కొట్టి మద్దతు తెలిపింది.

బ్యాటింగ్‌ సమయంలోనూ..
ఇక గిల్‌ బ్యాటింగ్‌ను కూడా సారా ఎంజాయ్‌ చేసింది. బౌండరీ కొట్టినప్పుడల్లా చప్పట్లు చరుస్తూ సారా ఎంకరేజ్‌ చేసింది. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో హసన్‌ మహమూద్‌ బౌలింగ్‌లో గిల్‌ ఎడ్జ్‌ తీసుకున్న బాల్‌ థర్డ్‌ మ్యాన్‌ దిశగా బౌండరీకి వెళ్లింది. ఈ ఫోర్‌ తర్వాత సారా టెండూల్కర్‌ ఫుల్‌ ఎగై్జట్‌ అయి గట్టిగా చప్పట్లు కొడుతూ సెలబ్రేట్‌ చేసుకుంది. బ్యాటింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ రెండు సిక్స్‌లు బాదగా.. ఈ రెండు సందర్భాల్లోనూ సారా టెండూల్కర్‌ చప్పట్లతో అతన్ని అభినందించింది. గిల్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో చప్పట్లు కొడుతూ ఆనందంలో మునిగిపోయింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘హమారీ బాబీ కైసీ హో, సారా బాబీ జైసీ హో‘ అని జనం కామెంట్‌ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌..
సోషల్‌ మీడియాలో గిల్, సారా టెండూల్కర్‌ ఒకరినొకరు ఫాలో కావటం, పోస్టులకు కామెంట్స్‌ కూడా పెడుతూ రావటంతో అప్పట్లో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. గిల్‌ ఆడే మ్యాచ్‌లకు సారా సైతం హాజరవుతూ రావటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. మరోసారి సారా మ్యాచ్‌కు హాజరుకావడంతో సోషల్‌ మీడియా వేదికగా మరోసారి శుభ్‌మన్‌ గిల్‌–సారా టెండూల్కర్‌ వార్తల్లో నిలిచారు. ఈ రూమర్లకు సారా టెండూల్కర్‌ ప్రవర్తన బలం చేకూర్చుంది. ఈ ఇద్దరి మధ్య మళ్లీ ప్రేమ మొదలైందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. శుభ్‌మన్‌ గిల్‌ కోసమే సారా టెండూల్కర్‌ ఈ మ్యాచ్‌కు వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు.

https://twitter.com/i/status/1714968005808181304

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version