Homeక్రీడలుక్రికెట్‌India vs New Zealand T20 Final: ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే.. ట్రోఫీ ఎవరికి...

India vs New Zealand T20 Final: ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే.. ట్రోఫీ ఎవరికి దక్కుతుంది?

India vs New Zealand T20 Final: టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ట్రోఫీ కోసం న్యూజిలాండ్, భారత్ పోటీ పడబోతున్నాయి. రెండు జట్ల మధ్య పోరు హోరా హోరీగా సాగే అవకాశం ఉంది. రెండు జట్లలో భీకరమైన ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సొంత గడ్డమీద టి20 వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది. ఈసారైనా ట్రోఫీ గెలవాలని న్యూజిలాండ్ జట్టు పట్టుదలతో ఉంది. అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి స్థానంలో రింకు సింగ్, కులదీప్ యాదవ్ ను తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు జట్టులో ఎటువంటి మార్పులు లేకుండానే ఫైనల్ మ్యాచ్ కు సిద్ధం కావాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ మ్యాచ్ నిర్వహణకు వర్షం ఆటంకం కలిగిస్తే.. రిజర్వ్ డే ఉంటుంది. సోమవారం కూడా వర్షం కురిసి మ్యాచ్ రద్దు అయితే.. అప్పుడు న్యూజిలాండ్, భారత జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. అయితే ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ ప్రాంతంలో ఆదివారం వర్షం కురిసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. అహ్మదాబాద్ ప్రాంతంలో వాతావరణం పొడిగా ఉన్న నేపథ్యంలో డ్యూ కూడా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది

ఇప్పటివరకు జట్టులో రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్ స్థానాలు మాత్రమే అటు ఇటు అయ్యాయి. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో అక్షర్ ఆడలేదు. అతడు ఆడక పోవడం వల్ల జట్టు మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే ఫైనల్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి స్థానాలు వేరే ఆటగాళ్లతో భర్తీ చేస్తారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అభిషేక్ శర్మ స్థానాన్ని రింకు సింగ్ లేదా వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి స్థానాన్ని కులదీప్ యాదవ్ తో భర్తీ చేస్తారని ప్రచారంలో ఉంది.

వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ స్థానాలపై ఇంతవరకు మేనేజ్మెంట్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రాక్టీస్ సెషన్ లో వారిద్దరూ పాల్గొన్నారు. ఇటీవల కాలంలో వీరిద్దరూ సరిగా ఆటం లేదు. అందువల్ల వీరిద్దరి మీద ఒత్తిడి విపరీతంగా ఉంది. పైగా వీరిద్దరూ icc t20 ఫార్మేట్ లో నెంబర్ వన్ బౌలర్, నెంబర్ వన్ బ్యాటర్ గా కొనసాగుతున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్లో వీరిద్దరిని ఆడిస్తారని.. జట్టులో ఎటువంటి మార్పులకు ఆస్కారం లేదని తెలుస్తోంది. ఇదే గనక జరిగితే అభిషేక్ శర్మకు, వరుణ్ చక్రవర్తికి చివరి అవకాశమని.. ఈ అవకాశాన్ని వారిద్దరు నిరూపించుకుంటే టీమిండియా ఫైనల్ మ్యాచ్లో గెలిచినట్టేనని అభిమానులు భావిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version