Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్లో భోలే గలీజ్ పని… అందరి తినే కూరలో!

ప్రియాంక అయితే థూ అని భోలే ఎదుట ఊచింది. దీనికి భోలే హర్ట్ అయ్యాడు. నేను తిరిగి అంటే నీ పరిస్థితి ఏంటని భోలే అన్నాడు. శోభా శెట్టితో కూడా అతడికి గొడవలు అయ్యాయి.

Written By: NARESH, Updated On : October 20, 2023 3:05 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7లో వైల్డ్ కార్డుతో అర్జున్, పూజా మూర్తి, నయని పావని, భోలే, అశ్విని ఎంట్రీ ఇచ్చారు. వీరిలో భోలే షావలి ప్రవర్తన కొంచెం వింతగా ఉంది. అతడు ఎవరినీ హర్ట్ చేయడం లేదు. నవ్వుతూ పలకరిస్తున్నాడు. అయితే అదంతా ఫేక్ స్మైల్ అంటారు కంటెస్టెంట్స్. ఈవారానికి గానూ జరిగిన నామినేషన్స్ లో ప్రియాంక, శోభా శెట్టి అతని మీద విరుచుకుపడ్డారు. ఫ్లో భోలే ఒకటి రెండు బూతు పదాలు జారాడు. దాన్ని సాకుగా చూపుతూ సీరియల్ బ్యాచ్ ఫైర్ అయ్యారు.

ప్రియాంక అయితే థూ అని భోలే ఎదుట ఊచింది. దీనికి భోలే హర్ట్ అయ్యాడు. నేను తిరిగి అంటే నీ పరిస్థితి ఏంటని భోలే అన్నాడు. శోభా శెట్టితో కూడా అతడికి గొడవలు అయ్యాయి. నువ్వు మెంటల్ ఆసుపత్రిలో ఉండాల్సిన దానివి అనడం వివాదాస్పదం అయ్యింది. ఈ విషయంలో ఎవరిది తప్పు అనేది పక్కన పెడితే భోలే ఇంటి సభ్యుల టార్గెట్ అయ్యాడు. సందీప్, అమర్ దీప్, అర్జున్, ప్రియాంక, శోభా భోలేని నామినేట్ చేశారు.

కాగా భోలే వంటగదిలో చేసిన ఓ పని రికార్డు అయ్యింది. అందరి కోసం చేసిన కూర గిన్నెలో ఉన్న గరిట తీసుకొని నోటితో టేస్ట్ చేసి మరలా అందులోనే పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేస్తున్నారు. భోలే ఎంగిలి చేసిన గరిటె కూర గిన్నెల్లో వేశాడంటూ తప్పుబడుతున్నారు. అయితే దీన్ని కొందరు ఖండిస్తున్నారు. భోలే ఎంగిలి చేయలేదు. గరిటెతో కూర బయటకు తీసి స్మెల్ చేసి అందులో పెట్టాడని అంటున్నారు.

అతడు తిన్నాడా? స్మెల్ చేశాడా? అనేది తెలియడం లేదు. కెమెరాలో భోలే కచ్చితంగా ఏం చేశాడు అనేది రికార్డు కాలేదు. మరోవైపు అమర్ దీప్, గౌతమ్, తేజ, ప్రశాంత్, పూజా, భోలే, అశ్విని నామినేషన్స్ లో ఉన్నారు. భోలే ఓటింగ్లో ఐదో స్థానంలో ఉన్నాడట. అశ్విని, పూజా చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారట. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారని సమాచారం.