Sanju Samson : ఐదు బంతులకు ఐదు సిక్సర్లు.. సంజు బ్రో నీ పొలంలో మొలకలు వచ్చినట్టే.. ఈ వీడియో చూడాల్సిందే

సంజు శాంసన్.. యువ ఆటగాడు.. ఎంతో నైపుణ్యం ఉన్నవాడు.. ఇతడికి టీమిండియాలో అవకాశాలు సరిగా లభించేవి కావు. దీంతో ఇతడి కోసం అభిమానులు సామాజిక మాధ్యమాలలో ఏకంగా ఒక క్యాంపెయిన్ రన్ చేశారు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 13, 2024 11:16 am

Sanju Samson

Follow us on

Sanju Samson : ఎట్టకేలకు అవకాశం లభించినప్పటికీ.. వాటిని అతడు సరిగ్గా వాడుకోలేదు. కొన్నిసార్లు ధాటి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. తన స్థాయికి తగ్గట్టుగా ఆటను అతడు ప్రదర్శించలేకపోయాడు. దీంతో అతడికి ఆ జట్టులో స్థానం స్థిరంగా ఉండడం కష్టమైపోయింది. సరిగ్గా ఇన్ని సంవత్సరాలకు వచ్చిన అవకాశాన్ని అతడు వినియోగించుకున్నాడు. యువకులు జట్టులోకి వస్తున్న సమయంలో.. ఒత్తిడిని అధిగమించి.. బ్యాట్ తో తాండవం చేశాడు.. హైదరాబాద్ వేదికగా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మూడవ టి20 మ్యాచ్లో పరుగుల వరద పారించాడు. మొత్తంగా తన బ్యాటింగ్ పవర్ చూపించాడు.

అప్పుడు స్థానం లభించింది

2015లో జింబాబ్వే తో జరిగిన సిరీస్ ద్వారా సంజు శాంసన్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే గత పది సంవత్సరాలుగా అతడు ఆడింది కేవలం 32 మ్యాచ్ లు మాత్రమే. కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. అతడి సగటు 20 లోపే ఉంది. అవకాశాలు లభించినప్పటికీ వాటిని అతడు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. అభిమానులు అతనికి సోషల్ మీడియా వేదిక ద్వారా ఎంతగా మద్దతు ఇచ్చినప్పటికీ.. ఒత్తిడి సమయంలో అతడు సత్తా చాటలేకపోయాడు. దీంతో అతడి కెరియర్ ప్రమాదంలో పడింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మూడవ టి20 లో తాను ఎదుర్కొన్న 47 బంతుల్లో 111 పరుగులు చేసి సత్తా చాటాడు. బంగ్లా బౌలింగ్ ను ఊచ కోత కోశాడు. కల్లోల ఇన్నింగ్స్ ఆడి.. బంగ్లా బౌలర్లకు నిద్రలేని రాత్రిని పరిచయం చేశాడు.. వాస్తవానికి ఐపీఎల్ లో సంజు అద్భుతంగా ఆడతాడు. ఐపీఎల్ లో సంజు ఆటను చూసిన వారికి.. బంగ్లా పై అతడు చేసిన ప్రదర్శన పెద్దగా ఆశ్చర్యం అనిపించదు.. కేరళ రాష్ట్రానికి చెందిన సంజు ఐపిఎల్ లో ఇంతకంటే మెరుపు ఇన్నింగ్స్ లు చాలానే ఆడాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారిగా అదరగొట్టాడు. టి20 క్రికెట్లో మొదటిసారి అతడు సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ అనంతరం వేగంగా 40 బంతుల్లో శతకం చేసిన రెండవ భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు

ఈ క్రమంలోనే బంగ్లా లెగ్ స్పిన్నర్ రిషాద్ హుస్సేన్ బౌలింగ్లో వరుసగా ఐదు సిక్స్ లు కొట్టి అదరగొట్టాడు.. దీంతో సోషల్ మీడియాలో అతడి పేరు మార్మోగిపోతుంది.. ట్విట్టర్ నుంచి మొదలుపెడితే ఫేస్ బుక్ వరకు సంజు పేరే వినిపిస్తోంది. ముఖ్యంగా కేరళ అభిమానులైతే అతడి నామస్మరణతో ఊగిపోతున్నారు. ” 6 బంతులకు 5 సిక్సర్లు కొట్టావ్..సంజు బ్రో నీ పొలంలో మొలకలు వచ్చాయని” సామాజిక మాధ్యమాల వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.

స్థానం నిలిచినట్టేనా.

బంగ్లా పై అద్భుతమైన సెంచరీ చేసిన సంజుకు టీమిండియాలో స్థానం స్థిరంగా ఉంటుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. బంగ్లా జట్టుపై తొలి రెండు మ్యాచ్లలో అతడు 10, 29 రన్స్ మాత్రమే చేశాడు. చివరిదైనా మూడవ మ్యాచ్లో మాత్రం సెంచరీ చేశాడు. తనను విమర్శిస్తున్న వారికి బ్యాట్ తో గట్టిగా సమాధానం చెప్పాడు..సంజు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో సెలెక్టర్లకు ఇప్పుడు అసలైన సవాల్ ఎదురైందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.. గత కొన్ని సిరీస్ లలో సంజు జట్టులో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు.. అయితే ఈసారి అతడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. తాను ఎంత విలువైన ఆటగాడినో నిరూపించుకున్నాడు. అయితే వచ్చే మ్యాచ్ లలో సంజు ఇదే తీరుగా స్థిరత్వం కొనసాగిస్తే ఇబ్బంది ఉండదు.. ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ టి20కి దూరమయ్యారు. అలాంటప్పుడు వారి స్థానాన్ని సంజు లాంటి ఆటగాడు భర్తీ చేస్తే టీమిండియా కు తిరుగుండదు. అయితే వచ్చే మ్యాచ్ లలో సంజు ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.