Bigg Boss Telugu 8: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో జరిగిన హోటల్ టాస్క్ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం ఒకరిద్దరు తప్ప హౌస్ లో ఎవ్వరూ పెద్దగా అలరించలేకపోయారు. ఈ టాస్క్ లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే అవినాష్, యష్మీ మరియు రోహిణి మాత్రమే అని ఆడియన్స్ కి అనిపించే మాట. అయితే నాగార్జున కేవలం ఈ వారానికి మాత్రమే కాకుండా, గత 5 వారాల నుండి ఓజీ క్లాన్ లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన కంటెస్టెంట్ ఎవరు అని కంటెస్టెంట్స్ ని అడుగుతాడు. కంటెస్టెంట్స్ ఎక్కువ శాతం నభీల్ కి ఓటు వేస్తారు. అయితే నభీల్ కంటే మంచిగా నిఖిల్, పృథ్వీ, ప్రేరణ వంటి వారు టాస్కులు ఆడారు. కానీ నభీల్ కి ఎక్కువ ఓట్లు పడడానికి కారణం రాయల్ క్లాన్ వల్లే అని చెప్పొచ్చు.
వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా వీళ్ళు హౌస్ లోకి అడుగుపెట్టే ముందే నాగార్జున హౌస్ లో ఎవరు బాగా ఆడుతున్నారు అని అడగగా, అందరూ నభీల్ పేరే చెప్తారు. కాబట్టి ఎక్కువ శాతం ఆయనకే ఓట్లు పడ్డాయి కాబట్టి ఆయనే బెస్ట్ కంటెస్టెంట్ గా నిలిచాడు. కానీ పాపం నిఖిల్ టాస్కులు ఆడి వరుసగా నాలుగు సార్లు చీఫ్ అయ్యాడు, అది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కి కనిపించలేదు అంటూ సోషల్ మీడియా లో నిఖిల్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఆలోచిస్తే వాళ్ళ బాధలో కూడా న్యాయం ఉంది కదా..నిఖిల్ టాస్కులు ఆడడం లో కింగ్, చీఫ్ గా కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు, న్యాయం గా ఆలోచిస్తే బెస్ట్ కంటెస్టెంట్ ట్యాగ్ ఆయనకే ఇవ్వాలి, కానీ వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కి నిఖిల్ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అనే చెడ్డ అభిప్రాయం ఉండడం వల్లే ఆయనని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. అయితే నభీల్ కి నాగార్జున ఒక స్పెషల్ పవర్ ఇచ్చి, ఇన్ఫినిటీ రూమ్ లోకి రమ్మంటాడు.
అక్కడికి నభీల్ వెళ్లిన తర్వాత ‘నీ దగ్గర ఉన్న స్పెషల్ పవర్ తో, నువ్వు ఒక అన్ లిమిటెడ్ కోరిక కోరుకోవచ్చు, కానీ ఆ కోరిక కారణంగా ప్రైజ్ మనీ లో డబ్బులు కట్ చేయబడతాయి, ఆలోచించుకొని ఆ కోరిక కోరుకో’ అని అంటాడు. అప్పుడు నభీల్ హౌస్ లో అందరికీ అన్ లిమిటెడ్ ఫుడ్ వచ్చేలా చేయండి అని కోరుకుంటాడు. నాగార్జున అందుకు ఒప్పుకుంటాడు. దీంతో హౌస్ మేట్స్ అందరికీ అన్ లిమిటెడ్ ఫుడ్ దొరుకుతుంది. ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఆహరం విషయంలో ఎన్ని గొడవలు జరిగాయో మన అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు హౌస్ మేట్స్ కి అన్ లిమిటెడ్ ఆహరం కోరుకొగానే వచ్చేస్తుంది. ఏమి తినాలన్నా తినేయొచ్చు, టాస్కులు ఆడేందుకు బోలెడంత బలం కంటెస్టెంట్స్ కి చేకూరుతుంది. ఈ ఎపిసోడ్ నేడు టెలికాస్ట్ కానుంది.