Devara Collections : దసరా రోజు బాక్స్ ఆఫీస్ వద్ద శివ తాండవం ఆడేసిన ‘దేవర’..ఒక్క రోజులో ఇంత వసూళ్లా? చరిత్రలో ఇదే తొలిసారి!

దసరా సెలవుల్లో వచ్చిన ఆ వసూళ్లను చూసి కచ్చితంగా 'దసరా' రోజు భారీ వసూళ్లు వస్తాయని అంచనా వేశారు ట్రేడ్ పండితులు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం దసరా రోజు శివ తాండవం ఆడేసింది అనే చెప్పొచ్చు. మ్యాట్నీ షోస్ నుండి ప్రతీ సెంటర్ లో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో హౌస్ ఫుల్స్ పడ్డాయి.

Written By: Vicky, Updated On : October 13, 2024 11:54 am

Devara Movie Collection

Follow us on

Devara Collections :  ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో లాంగ్ రన్ వచ్చిన సినిమాల సంఖ్య చాలా తక్కువే. ఓపెనింగ్స్ భారీ గా వస్తాయి కానీ, లాంగ్ రన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ‘దేవర’ చిత్రం మాత్రం లాంగ్ రన్ లో ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిల్చింది అని చెప్పొచ్చు. మొదటి వారం అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు కానీ, అక్టోబర్ 3 వ తారీఖు నుండి స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇవ్వడం తో రెండవ వారం మొదటి వారం కంటే మంచి ఆక్యుపెన్సీలను నమోదు చేసుకోవడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురి చేసింది.

గడిచిన 5 సంవత్సరాలలో ఒక పెద్ద హీరో సినిమాకి మొదటి వారం కంటే రెండవ వారం మంచి ఆక్యుపెన్సీలు రావడం జరగలేదు. మొట్టమొదటిసారి ఆ ఘటన ‘దేవర’ విషయంలోనే జరిగింది. దసరా సెలవుల్లో వచ్చిన ఆ వసూళ్లను చూసి కచ్చితంగా ‘దసరా’ రోజు భారీ వసూళ్లు వస్తాయని అంచనా వేశారు ట్రేడ్ పండితులు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం దసరా రోజు శివ తాండవం ఆడేసింది అనే చెప్పొచ్చు. మ్యాట్నీ షోస్ నుండి ప్రతీ సెంటర్ లో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో హౌస్ ఫుల్స్ పడ్డాయి. సీడెడ్ లోని కొన్ని ప్రాంతాల్లో అయితే రెండవ రోజు కంటే ఎక్కువ వసూళ్లు నమోదు అవ్వడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తరాంధ్ర ప్రాంతం లో అయితే C ,D సెంటర్స్ కూడా హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకోవడం ఆశ్చర్యార్ధకం. ఓవరాల్ గా ఈ చిత్రానికి దసరా రోజు తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల రూపాయిలు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ లెక్కల్లో చూస్తే 3 కోట్ల 45 లక్షల రూపాయిలు వచ్చినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

దసరా కి గోపీచంద్ నటించిన ‘విశ్వం’, రజినీకాంత్ నటించిన ‘వెట్టియాన్’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలకంటే ‘దేవర’ చిత్రానికి అత్యధిక ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి. బుక్ మై షో టికెట్ పోర్టల్ యాప్ లో కూడా అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన సినిమాగా ‘దేవర’ చిత్రం నిల్చింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ‘దేవర’ చిత్రం దసరా రోజు మంచి వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఇక నేడు ఆదివారం కావడంతో, నేడు కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే రన్ ని రాబోయే రోజుల్లో కూడా ఈ చిత్రం కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి.