Homeక్రీడలుSanjeev goyanka and Rishabh pant : పాపం రిషబ్ పంత్.. వేలు చూపిస్తూ క్లాస్...

Sanjeev goyanka and Rishabh pant : పాపం రిషబ్ పంత్.. వేలు చూపిస్తూ క్లాస్ తీసుకున్న సంజీవ్ గొయెంకా!

Sanjeev goyanka and Rishabh pant : గత సీజన్లో హైదరాబాద్ గట్టుతో ఓడిపోయిన తర్వాత లక్నో(Lucknow super giants) జట్టు యజమాని సంజీవ్ గొయెంకా(Sanjeev goyanka) కెప్టెన్ కేఎల్ రాహుల్ తో వాగ్వాదానికి దిగాడు. ఆ పరిణామంతో నొచ్చుకున్న కేఎల్ రాహుల్.. లక్నో జట్టు నుంచి బయటికి వచ్చాడు. దానికంటే ముందుగానే మేనేజ్మెంట్ కు సంకేతాలు ఇచ్చాడు. ఆ తర్వాత అతడిని ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఢిల్లీ జట్టు అక్షర్ పటేల్ నాయకత్వంలో విజయాలు సాధిస్తూ పర్వాలేదనిపిస్తోంది. ఇక లక్నో జట్టు పడుతూ లేస్తూ సాగుతోంది. తొలి మ్యాచ్ లో ఢిల్లీ జట్టు చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్ లో హైదరాబాద్ పై విజయం సాధించింది. మూడో మ్యాచ్లో పంజాబ్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. మంగళవారం లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ పంజాబ్ జట్టు అన్ని విభాగాలలో లక్నోపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అంతేకాదు బ్యాటింగ్ లో వీర లెవెల్ ప్రదర్శన ఇచ్చింది. దీంతో లక్నో జట్టుకు ఓటమి తప్పలేదు. సొంత వేదికలో ఓడిపోవడంతో లక్నో జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..

Also Read : 27 కోట్లు పెట్టి కొంటే.. 17 పరుగులా..

గట్టిగానే క్లాస్ తీసుకున్నాడు

లక్నో జట్టు పేరు చెప్పగానే.. ఆ జట్టు యజమాని సంజీవ్ గొయెంకా గుర్తుకొస్తారు. జట్టు విజయం సాధిస్తే ఆయన అమితానందాన్ని వ్యక్తం చేస్తారు. అదే జట్టు ఓడిపోతే మాత్రం ఆయనలో ఉన్న రాక్షసుడు బయటికి వస్తాడు. జట్టుబడి పోతే కెప్టెన్ మీద ఎటాక్ మొదలు పెడతాడు. లక్నో జట్టు మంగళవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ చేతిలో ఓడిపోయిన తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh pant) కు క్లాస్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓటమి తర్వాత రిషబ్ పంత్ చేతులు కట్టుకొని నిలబడి ఉండగా.. సంజీవ్ గొయెంకా అతడి వైపు వేలు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. జట్టులో ఐకమత్యం లేదని.. ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేయాలి అనే అర్థం వచ్చేలాగా పంత్ కు సంజీవ్ గొయెంకా క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సంజీవ్ గొయెంకా వ్యవహార శైలిపై కూడా నెటిజన్లు స్థాయిలో మండి పడిపోతున్నారు. జట్టులో కోచ్ లు, సహాయక సిబ్బంది ఉండగా..సంజీవ్ గొయెంకా కెప్టెన్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటని వ్యాఖ్యానిస్తున్నారు..” ఈ ఓనర్ వివాదాలతోనే గుర్తింపు సంపాదిస్తున్నారు. ప్రతి మ్యాచ్ తర్వాత బయటికి వస్తున్నారు. కెప్టెన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బిల్డప్ ఇచ్చి ఏం చేయాలనుకుంటున్నారో సంజీవ్ గొయెంకా కే తెలియాలి. ఆటలో గెలుపు ఓటములు సహజం. వేలకోట్లకు అధిపతి అయిన ఈ కార్పొరేట్ వ్యక్తికి ఆ విషయం తెలియకపోవడం బాధాకరమని” నెటిజన్లు సంజీవ్ గొయెంకా ను ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు.

Also Read : రిషబ్ పంత్ మీద పట్టరాని కోపంతో టీవీ పగలగొట్టాడు.. వీడియో వైరల్

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular