Annamalai : తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నామలైను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించడం సంచలన వార్త అయ్యింది. అన్ని పత్రికలు ఈ వార్తలను ప్రచురించాయి. అన్నామలైను తొలగిస్తున్నారని.. కొత్త అధ్యక్షుడిని పెడుతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అన్నాడీఎంకేతో పొత్తు కోసం బీజేపీ ఈ పనిచేస్తోందని అంటున్నారు. ఇదే నిజమైతే బీజేపీ చేస్తున్న ఘోరమైన తప్పు ఇదే అవుతోంది.
ఫళనిస్వామి కలిసినంత మాత్రానా.. అన్నాడీఎంకే కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని తీసేస్తారా? బీజేపీ ఈ లీకులు చేయడం.. కారణాలు చెప్పడం ఎవ్వరూ సహించడం లేదు.
ఫళనిస్వామితో పొత్తు పెట్టుకుంటే ఆయనతో సఖ్యతతో ఉండే నాయకుడి కోసం బీజేపీ చూస్తోందని.. ఫళనిస్వామితో అన్నామలైకి అస్సలు పడదని.. అందుకే తీసేస్తున్నారని సమాచారం. ఫళనిస్వామి డిమాండ్ మేరకే అన్నామలైను తొలగిస్తున్నారని సమాచారం.
అన్నాడీఎంకే తో పొత్తు కోసం అన్నామలై తొలగింపా? ఇది నిజమా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.