Insomnia: మనిషికి కావాల్సిన ఆరోగ్యంలో భాగంగా కంటినిండా నిద్ర కూడా ఉండాలి. ప్రతి వ్యక్తి కనీసం రోజుకు 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలా కాకుండా తక్కువ సమయం నిద్రపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే పురుషులు ఫీల్డ్ వర్క్ చేయడం వల్ల రకరకాల ఒత్తిడితో కలిగి ఉంటారు. దీంతో మానసిక వేదనతో రాత్రిళ్ళు సరైన నిద్రపోలేరు. అలాగే కొందరు పురుషులు మద్యం ఇతర వ్యసనాల కారణంగా రాత్రులు మెలకువతో ఉంటారు. దీంతో వీరికి నిద్ర దూరం అవుతుంది. కానీ కొన్ని అధ్యయనాల ప్రకారం పురుషుల కంటే మహిళలే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని అంటున్నారు. అమెరికాకు చెందిన Resmed అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం ప్రజల కంటే మహిళల్లోని నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. అయితే నిద్రలేమి సమస్య లేకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
పురుషులకంటే మహిళలే ఇంట్లో పనులతో ఎక్కువగా బిజీగా ఉంటారు. కొందరు మహిళలకు ఉదయం నుంచి రాత్రి వరకు తీరిక కూడా ఉండదు. అయితే వీరు విశ్రాంతి లేకుండా పనులు చేయడం వల్ల శారీరకంగా అలసిపోతారు. అందువల్ల మీరు కనీసం కొన్ని గంటలపాటు విశ్రాంతి తీసుకోవాలి. అయితే ఈ విశ్రాంతి నిద్రపోయే ముందు ఉండడం వల్ల సరైన నిద్ర వస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు దీనిని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి.
పడకగదిలో అపరిశుభ్ర వాతావరణం ఉండడంవల్ల సరైన నిద్ర ఉండదు. అందువల్ల మహిళలు పడకగదని పరిశుభ్రంగా మార్చుకోవాలి. అవసరమైతే సువాసనను వెదజల్లే పుష్పాలు లేదా ఇతర స్ప్రే యూస్ చేయాలి. మంచి సువాసన ఉండటం వల్ల మనిషికి హాయిగా ఉంటుంది. దీంతో అనువైన నిద్ర వస్తుంది.
మహిళలు కొంతమంది ఇంట్లోనే ఉండడం వల్ల శారీరకంగా శ్రమ ఉండదు. ఈ కారణంగా బరువు పెరుగుతారు. అయితే బరువు పెరుగుతున్నట్లు గ్రహిస్తే వెంటనే వ్యాయామం చేయడానికి ప్రయత్నించాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీంతో మెదడుకు అవసరమైన రక్తం అంది.. ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఫలితంగా హాయిగా నిద్రపోతారు.
కొంతమంది మహిళలు నిత్యం కెఫిన్ కలిగిన పదార్థాలను తాగుతూ ఉంటారు. టిఫిన్ నిద్రను లేకుండా చేస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు దీనికి దూరంగా ఉండటం వల్ల సరైన నిద్ర పోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే టీ లేదా కాఫీ అలవాటు ఉన్నవారు వీటికి ప్రత్యామ్నాయంగా గ్రీన్ టీ లేదా ఇతర ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి.
ఇంట్లోనే ఉన్నా కొందరు మహిళలు సమయానికి ఆహారం తీసుకోరు. కారణంగా ఆహారంపై శ్రద్ధ చూపించారు. అయితే సమయానికికూలంగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరం ఎనర్జీగా ఉండి మంచి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల సమయానికికూలంగా ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే మొబైల్ కూడా దూరంగా ఉండాలి. మొబైల్ వల్ల ఎక్కువగా స్క్రీన్ నైట్ కళ్ళపై పడి నిద్ర లేని సమస్య వచ్చే అవకాశం ఉంది.