Salman Ali Agha: పాకిస్తాన్ ఏ విజయంలో అయినా ఓవరిపై ఓడినా సహిస్తుంది కానీ, భారత్‌పై ఓడితే తట్టుకోలేరు. క్రికెట్ విషయంలో ఇది ఇటు భారత అభిమానులో.. అటు పాకిస్తాన్ అభిమానుల్లో ఎక్కువ. అభిమానుల అంచనా మేరకే ఇరు జట్ల క్రికెటర్లు ఆడతారు. కానీ విజయం ఒకరినే వరిస్తుంది. తాజాగా ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు మూడు మ్యాచ్‌లలో తలపడ్డాయి. కానీ అన్ని మ్యాచ్‌లలో భారత్ చేతిలో దాయాది జట్టు చిత్తయింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో విజయం అంచు వరకు వచ్చి ఓడిపోయింది. దీనిని పాకిస్తాన్ అభిమానులతోపాటు పీసీబీ అధికారులకు కూడా మింగుడు పడలేదు. కీలక మ్యాచ్‌లలో స్థాయికి తగ్గ లేకపోవడం జట్టులో వ్యూహపరమైన లోపాలపై ప్రశ్నలు లేవనెత్తింది.
కెప్టెన్‌గా, బ్యాన్స్మెన్గా విఫలం..
జట్టు సారథిగా ఉన్న సల్మాన్ అఘా ఈ టోర్నీలో ప్రదర్శనలో తీవ్రంగా వెనుకబడ్డాడు. ఏడు మ్యాచ్‌లలో కేవలం 72 పరుగులు (సగటు 12) మాత్రమే సాధించడమే కాక, ఒమన్, యూఏఈ వంటి తేలికపాటి ప్రత్యర్థులపైనా రాణించలేకపోయాడు. ఈ పరిస్థితి పీసీబీలో విభేదాలకు కారణమైంది.
బోర్డు అసహనం..
తనపై కోచ్ మైక్ హుస్సేన్, సెలక్టర్ల మద్దతు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉన్నతాధికారులు సల్మాన్ ప్రదర్శనపై అసంతృప్తిగా ఉన్నారు. రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్‌లో కూడా అతను విఫలమైతే కెప్టెన్సీతోపాటు జట్టులో స్థానాన్ని కోల్పోయే అవకాశముంది. 32 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సల్మాన్ ఇప్పటి వరకు 561 పరుగులు మాత్రమే చేశాడు. 110 స్ట్రైక్ రేట్‌తోనే కొనసాగుతున్నాడు. ఈ గణాంకాలు ప్రస్తుతం ఆ ఫార్మాట్లో జట్టు అవసరాలకు సరిపోవడం లేదు. ఈ క్రమంలో ఆసియాకప్ జట్టులో చోటు దక్కని మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం ఇప్పుడు తిరిగి ఎంపిక చేయాలని సెలక్టర్లు నిర్ణయించినట్లు సమాచారం. వీరి రాకతో లీడర్షిప్, బ్యాటింగ్ లైనప్ రెండింట్లోనూ మార్పులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.
దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు టీ20 మ్యాచ్‌లు, సల్మాన్ అఘా కెరీర్లో కీలకమైన మలుపు కావచ్చు. ఇవే అతను తన స్థానాన్ని నిలబెట్టుకునే చివరి అవకాశాలుగా భావించాలని పాక్ మీడియా విశ్లేషిస్తోంది.