IPL 2025 : చండీగఢ్ వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్లు అదరగొడుతున్నారు. హర్షిత్ రాణా ఇప్పటికే మూడు వికెట్లు పడగొట్టాడు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి చెరి రెండు వికెట్లు సాధించారు. నోర్ట్జే ఒక వికెట్ పడగొట్టాడు.. మొత్తంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఈ కథనం రాసే సమయం వరకు 8 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. పంజాబ్ జట్టు ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(22), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (30) ఎప్పటిలాగే దూకుడుగా ఆడారు. వీరిద్దరు తొలి వికెట్ కు 39 పరుగులు జోడించారు. ప్రియాన్ష్ ఆర్య అవుట్ అయిన తర్వాత.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజ్ లోకి వచ్చాడు. అతడు 0 పరుగులకే అవుట్ అయ్యాడు.. ఇక ఇక్కడి నుంచి పంజాబ్ జట్టు ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ చేరుకున్నారు..జోష్ ఇంగ్లిస్(2), నేహల్ వదేరా (10), మాక్స్ వెల్(7), సూర్యాన్ష్ షెడ్గే (4), మాకో జాన్సన్ (1) ఇలా వచ్చిన ఆటగాళ్లు వచ్చినట్టే అవుట్ కావడంతో..మ్యాచ్ పై కోల్ కతా నైట్ రైడర్స్ పూర్తిస్థాయిలో పట్టు బిగించింది. ప్రస్తుతం శశాంక్ సింగ్ (16), బార్ట్ లెట్(6) క్రీజ్ లో ఉన్నారు.
Also Read : రోహిత్ శర్మకు అరుదైన గౌరవం.. సచిన్ తర్వాత “RO” కే అవకాశం..
దారుణాతీదారుణం
మాక్స్ వెల్(7) ప్రస్తుత ఐపిఎల్ సీజన్లోనూ ఆట తీరు ఏమాత్రం మార్చుకోవడం లేదు. దారుణంగా ఆడుతున్నాడు. గత సీజన్ నుంచి ఇప్పటివరకు 14 ఇన్నింగ్స్ లో ఆడిన అతడు కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు. అతడి యావరేజ్ 6.64. స్ట్రైక్ రేట్ 110.71, ఇందులో ఐదుసార్లు డక్ అవుట్ అయ్యాడు.. 2024 నుంచి ఇప్పటివరకు ఆడుతున్న 75 మంది బ్యాటర్లలో.. అత్యల్ప యావరేజ్ గ్లెన్ మాక్స్ వెల్ కొనసాగిస్తున్నాడు అంటే.. అతని బ్యాటింగ్ ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు..”గత సీజన్లో బెంగళూరు జట్టు తరఫున ఇలానే ఆడాడు. దీంతో బెంగళూరు జట్టు ఆ దరిద్రాన్ని దించుకుంది. కానీ ఈ సీజన్ కి సంబంధించిన మెగా వేలంలో ఆ దరిద్రాన్ని పంజాబ్ జట్టు నెత్తిన పెట్టుకుంది. ఏకంగా 4.2 కోట్లకు మాక్స్ వెల్ ను దక్కించుకుంది. కానీ అతడు ఒక్కటంటే ఒక్కటి గొప్ప ఇన్నింగ్స్ ఆడ లేకపోతున్నాడు. ఇటువంటి ఆటగాడిని ఎందుకు కొనుగోలు చేసిందో పంజాబ్ జట్టు యాజమాన్యాలనికే తెలియాలని” సోషల్ మీడియాలో నెటిజెన్లు పేర్కొంటున్నారు. ” ఆస్ట్రేలియా జట్టుకు మాత్రం మాక్స్ వెల్ గొప్పగా ఆడుతాడు. ఐపీఎల్ లో మాత్రం చేతులెత్తేస్తాడు. కోట్లకు కోట్లు తీసుకుంటూ.. అనామక ఆటగాడిగా ఆడుతుంటాడు. అసలు అతడు అలా ఎందుకు చేస్తాడో అర్థం కావడం లేదని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
VARUN CHAKRAVARTHY DECEIVES MAXWELL WITH A BEAUTY. pic.twitter.com/COdmEukTXK
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2025