Rohit Sharma Virat Kohli : పొట్టి ఫార్మాట్ కు గత ఏడాది వీడ్కోలు పలికారు. ఈ ఏడాది సుదీర్ఘ ఫార్మాట్ కు కూడా వీడ్కోలు పలికారు. దీంతో వారిద్దరు వాడేది కేవలం వైట్ బాల్ ఫార్మాట్ మాత్రమే. టీ మీడియా వైట్ బాల్ ఫార్మాట్ ను ఆగస్టులో ఆడాల్సి ఉండేది. అయితే ఇప్పుడు అది వాయిదా పడింది. దీంతో ఆ ఇద్దరు ఆటగాళ్లు ఆడేది కష్టమే. ఇక వారి ఆట తీరును వచ్చే ఏడాది సెప్టెంబర్లో చూడాల్సిందే. ఆ ఇద్దరు ఆటగాళ్లు మరెవరో కాదు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ..
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లీష్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతోంది. తొలి టెస్ట్ లో ఓటమిపాలైంది. ఇక రెండో టెస్టులో లీడ్లో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ జట్టుతో సిరీస్ ముగిసిన తర్వాత ఆగస్టులో భారత్ బంగ్లాదేశ్ జట్టుతో వైట్ బాల్ ఫార్మాట్ ఆడాల్సి ఉండేది. బంగ్లాదేశ్ లో ఈ సిరీస్ జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆ దేశంలో భద్రతాపరంగా పరిస్థితులు బాగాలేవు. దీంతో రెండు జట్ల మేనేజ్మెంట్లు ఒక అంగీకారానికి వచ్చాయి. పరిస్థితులు బాగా లేకపోవడంతో సిరీస్ వచ్చే ఏడాది నిర్వహించాలని నిర్ణయించాయి. దీంతో వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో భారత్ – బంగ్లాదేశ్ మధ్య వన్డే సిరీస్ కొనసాగుతుంది. బంగ్లాదేశ్ జట్టుతో భారత్ 3 వన్డేలు, మూడు టి20 మ్యాచ్లు ఆడుతుంది..
బంగ్లాదేశ్లో కొంతకాలంగా రాజకీయంగా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి దేశం నుంచి వెళ్లిపోయారు. అప్పట్నుంచి అక్కడ తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినప్పటికీ అక్కడ పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. పైగా ఆందోళనలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. మరోవైపు భారత్ బంగ్లాదేశ్ మధ్య సానుకూల వాతావరణం లేదు. అందువల్ల ఈ సిరీస్ ను వాయిదా వేయాలని రెండు జట్లకి సంబంధించిన మేనేజ్మెంట్లు నిర్ణయించాయి. “పరిస్థితులు ఏ మాత్రం బాగోలేవు. ఎప్పుడు కుదుటపడతాయో అర్థం కావడం లేదు. సిరీస్ ల కంటే ఆటగాళ్ల భద్రత మాకు ముఖ్యం. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం.. రెండు జట్ల మేనేజ్మెంట్లు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సిరీస్ కొనసాగించడం కంటే వాయిదా వేయడం అత్యంత ముఖ్యమని” రెండు జట్ల మేనేజ్మెంట్లు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
సుదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన తర్వాత రోహిత్, విరాట్ కోహ్లీ వైట్ బాల్ ఫార్మాట్లో ఆడతారని అభిమానులు అంచనా వేస్తున్నారు. వారి ఆట తీరును ఆస్వాదించాలని భావించారు. కానీ అభిమానుల ఆశ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ జట్టుతో జరిగే వైట్ బాల్ సిరీస్ వాయిదా పడటంతో విరాట్, రోహిత్ ఇప్పట్లో ఆడే అవకాశాలు లేవు.. ఇక ప్రస్తుతం విరాట్, రోహిత్ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. తమకు లభించిన సమయాన్ని ఆస్వాదిస్తున్నారు.. కమర్షియల్ యాడ్స్ లో వారిద్దరూ కనిపిస్తున్నారు.