Upcoming Telugu Films: యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal) కచ్చితంగా ఉంటుంది. ఈమె చేసిందే తక్కువ సినిమాలు, వాటిల్లో కూడా అత్యధిక శాతం ఫ్లాప్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈమె అందానికి ఫ్యాన్స్ అయ్యారు. కేవలం అందం లోనే కాదు డ్యాన్స్ లో కూడా నిధి అగర్వాల్ కి మంచి టాలెంట్ ఉంది. సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండడం వల్ల ఆమె టాలెంట్ బయటపడింది. అందుకే హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఈమెకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu), ప్రభాస్(Rebel star Prabhas) తో ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రాలు చేసింది నిధి అగర్వాల్. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కాబోతున్నాయి. ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతుంది.
Also Read: విడిపోతున్న నయనతార, విఘ్నేష్? వేణు స్వామి చెప్పింది నిజం కాబోతుందా?
డిసెంబర్ 5న రాజా సాబ్ కూడా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే నిధి అగర్వాల్ రేంజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది. అయితే ఆమెకు మంచి రోజులు ఈ రెండు సినిమాలు విడుదలకు ముందే మొదలైనట్టుగా అనిపిస్తుంది. రీసెంట్ గానే విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబినేషన్ లో ఒక సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ నెలలోనే మొదలు కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం కావడం, గతం లో ఆయనతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ లాంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలకు పని చేసి మళ్ళీ ఇప్పుడు చేతులు కలపడంతో, ఈ ప్రాజెక్ట్ కి స్టార్ హీరో పాన్ ఇండియన్ సినిమాకు ఉన్నంత క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం లో ఒక హీరోయిన్ గా త్రిష ని ఎంచుకున్నారు. మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా పిలవబడే ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కి అవకాశం రావడం అదృష్టమే అనుకోవచ్చు. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని అందుకుంటూ కెరీర్ లో దూసుకెళ్తున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కుర్ర హీరోయిన్స్ అందరికంటే ఎంతో బెటర్ అని అందరి అభిప్రాయం.