Rohit Sharma Wife: సెలబ్రిటీలు బాధ్యతగా ఉండాలి. సోషల్ మీడియా విస్తృతి మరింత పెరుగుతున్న నేపథ్యంలో.. వారు పెట్టే పోస్టు. చేసే కామెంట్.. షేర్ చేసే విషయం ఇలా ప్రతిదానిని లక్షల మంది చూస్తారు. ఏ మాత్రం కాస్త అటూ ఇటూ అయినా తేడా కొట్టేస్తుంది. కళ్ళు మూసి తెరిచేలాగా వైరల్ అయిపోతుంది. అటు మీడియాలోనూ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇలా అనవసరంగా ఓ వివాదంలో తలదూర్చి టీమిండియా కెప్టెన్ సతీమణి రితిక సజ్దే వార్తల్లో వ్యక్తి అయ్యారు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ రచ్చ రచ్చ అవుతున్నది. దీంతో ఆమెపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మీడియా కూడా ఈ విషయంపై ప్రధానంగా దృష్టి సారించడంతో.. ఆమె ఆ పోస్ట్ తొలగించక తప్పలేదు. అయినప్పటికీ రితిక పోస్ట్ ను స్క్రీన్ షాట్ తీసి.. కొంతమంది తెగ ట్రోల్ చేస్తున్నారు.
ప్రస్తుతం గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయిల్ దాడులు జరుపుతోంది. ఈ క్రమంలో రితిక తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీ లో “అందరి కళ్ళూ రఫా నగరం పై ఉన్నాయని” రాసిన ఒక ఫోటోను షేర్ చేసింది.. అంతే.. దెబ్బకు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయింది. ఆమె షేర్ చేసిన పోస్ట్ ను ఉద్దేశించి హిందూ సంఘాలు తీవ్రవాఖ్యలు చేస్తున్నాయి. ” హిందువులపై దాడి జరిగినప్పుడు మీరు స్పందించారా? కాశ్మీర్లో పండిట్లు, మణిపూర్ ప్రాంతంలో హింస చెలరేగినప్పుడు మీరు స్పందించారా? దేశంలో ఎన్నో సమస్యలు నెలకొన్నాయి.. అప్పుడు మీరు ఏమాత్రం లెక్కపెట్టలేదు కదా” అంటూ నెటిజన్లు రితికను నిలదీస్తున్నారు..
వాస్తవానికి రితిక మానవతా దృక్పథంతో ఆ పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. పైగా రఫా నగరంపై ఇజ్రాయిల్ దాడులకు పాల్పడుతుండడంతో విస్తృతమైన చర్చ జరుగుతుంది.. గూగుల్ ట్రెండ్స్ లో “రఫా నగరం పై దాడులు” అనే టాపిక్ టాప్ సెర్చింగ్ లో ఉంది.. మరోవైపు ఈ నగరంపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు ఖండిస్తున్నారు.. ఈ క్రమంలోనే రితిక ఆ పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది.. రఫా లోని శరణార్థులు తలదాచుకుంటున్న శిబిరంపై ఇజ్రాయిల్ దాడి చేయడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇజ్రాయిల్ చేసిన ఈ దాడిలో 45 మంది పాలస్తీనా పౌరులు కన్నుమూశారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మన దేశాన్ని చెందిన చాలామంది పాలస్తీ నాకు సంఘీభావం తెలుపుతున్నారు. సమంత, త్రిష, మాళవిక మోహనన్, కరీనాకపూర్, ప్రియాంకా చోప్రా, త్రిప్తి డిమ్రి, సోనాక్షి సిన్హా, దియా మీర్జా, దుల్కర్ సల్మాన్, అమీ జాక్సన్, అలియా భట్, వరుణ్ ధావన్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా పాలస్తీనాకు సంఘీభావం ప్రకటించారు. అయితే రితిక కూడా ఇదే తీరుగా తన సంఘీభావాన్ని వ్యక్తం చేసింది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రోహిత్ శర్మకు సంబంధించిన ప్రతి విషయాన్ని అతడి అభిమానులతో పంచుకుంటుంది. అప్పట్లో రోహిత్ శర్మను ముంబై జట్టు కెప్టెన్ గా తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.. అయితే all eyes on Rafah పోస్ట్ రితికను వార్తల్లో వ్యక్తిని చేసింది. మిగతా నటీనటులపై ఆగ్రహం వ్యక్తం చేయని హిందూ సంఘాలు.. రితికపై ఎదురుదాడికి దిగడం పట్ల సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుందో చూడాల్సి ఉంది.
Meet Ritika Sajdeh, wife of Rohit Sharma.
“Did she ever talk about Kashmiri Pandits?”
-No“Did she ever talk about the vιolence happening by a specific community in India?”
-No“Did she ever raise her voice for Hindus being persecuted in Pakistan and Bangladesh?”
-No“Did she… pic.twitter.com/SFNrMHOtAM
— Mikku (@effucktivehumor) May 28, 2024