https://oktelugu.com/

Nikki Haley: ఇజ్రాయెల్ షెల్‌పై నిక్కీ హేలీ ఏం రాసిందంటే?

అమెరికా అధ్యక్ష పదవికి గతంలో పోటీ చేసిన అభ్యర్థి నిక్కీ హేలీ లెబనాన్ ఉత్తర సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తుంది. ఆ సమయంలో ఇజ్రాయెల్ షెల్ పై ‘ఫినిష్ ధెమ్’ అని మార్కర్ తో రాసింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : May 29, 2024 7:11 pm
    Nikki Haley

    Nikki Haley

    Follow us on

    Nikki Haley: పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల మధ్య వార్ ఇప్పటిది కాదు.. చుట్టూ వ్యతిరేక శక్తులు ఉన్న ఇరాన్, ఇరాక్, పాలస్తీనా లాంటి శత్రుదేశాల మధ్య ఇజ్రాయెల్ ఏళ్ల తరబడి నలిగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలీ రాసిన ఒక కొటేషన్ పై ఇప్పుడు ప్రపంచ వ్యా్ప్తంగా చర్చ జరుగుతోంది.

    అమెరికా అధ్యక్ష పదవికి గతంలో పోటీ చేసిన అభ్యర్థి నిక్కీ హేలీ లెబనాన్ ఉత్తర సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తుంది. ఆ సమయంలో ఇజ్రాయెల్ షెల్ పై ‘ఫినిష్ ధెమ్’ అని మార్కర్ తో రాసింది. అయితే ఇటీవల హేలీ పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ పార్లమెంటు సభ్యుడు, ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి డానీ డానన్ మంగళవారం ఎక్స్ (ట్విటర్)లో ఈ ఫోటోను షేర్ చేశారు. దానికి క్యాప్షన్ గా ‘నా స్నేహితురాలు, మాజీ రాయబారీ నిక్కి హేలీ రాసినది ఇదే ‘ఫనిష్ ధెమ్’ అని డానన్ పెట్టాడు. డోనాల్డ్ ట్రంప్ హయాంలో హేలీ ఐక్యరాజ్య సమితి రాయబారి పదవిలో పని చేశారు. ఆమె పదవీకాలం డానన్ తో సమానంగా కొనసాగింది.

    హమాస్ తీవ్రవాదులు దక్షిణ ఇజ్రాయెల్ పై అక్టోబర్ 7వ తేదీ దాడి చేయగా.. ఇందులో 1189 మంది మరణించారు. ఇందులో ఎక్కువగా పౌరులు ఉన్నారు. వీరిలో ఉగ్రవాదులు 252 మందిని బందీలుగా పట్టుకున్నారు. వారిలో 121 మంది గాజాలోనే ఉన్నారు. ఇందులో కూడా 37 మంది చనిపోయారని సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ పాలస్తీనా రాజధాని గాజాపై ప్రతీకార దాడి చేసింది. ఈ దాడిలో కనీసం 36,096 మంది మరణించారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

    రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ఘోర పరాజయాలు చవిచూడడంతో 52 ఏళ్ల హేలీ మార్చిలో వైట్ హౌజ్ బిడ్ ను విరమించుకుంది. దీంతో ట్రంప్ ఆమెను ఉపాధ్యక్ష పదవికి అనర్హురాలిగా ప్రకటించాడు. అయినా కూడా 2028లో ఆమె అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశం ఉంది. రఫాపై ఘోరమైన దాడి తర్వాత అధ్యక్షుడు జో బైడెన్ తన ఇజ్రాయెల్ విధానాన్ని మార్చే యోచన లేదని, అయితే పాలస్తీనా పౌరుల దుస్థితిని పట్టించుకోవడం లేదని వైట్ హౌస్ మంగళవారం (మే 28) తెలిపింది.