Rohit Sharma And Virat Kohli: ఆస్ట్రేలియా తో 3 వన్డేలు, రెండు టి20 సిరీస్ నిమిత్తం టీమిండియా కంగారు గడ్డమీద అడుగుపెట్టింది. వన్డే ఫార్మేట్ కు గిల్ నాయకత్వం వహించబోతున్నాడు. సారధిగా అతనికి ఇది తొలి వన్డే సిరీస్. ఇంగ్లాండ్ సిరీస్ ద్వారా టెస్ట్ జట్టులో నాయకుడిగా తాను ఏమిటో నిరూపించుకున్నాడు. వెస్టిండీస్ సిరీస్ ను వైట్ వాష్ చేయడం ద్వారా సత్తా చాటాడు. ఇప్పుడు వన్డే జట్టుకు నాయకుడిగా తన బృందంతో ఆస్ట్రేలియా గడ్డం మీద అడుగు పెట్టాడు. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. భారత ప్లేయర్లు గురువారం నుంచి ప్రాక్టీస్ మొదలు పెడతారని తెలుస్తోంది. ఆదివారం నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా వన్డే సిరీస్ మొదలుపెడుతుంది. పెర్త్ వేదికగా తొలి వన్డే జరుగుతుంది.
గతంలో టీమిండియా కు సారథిగా రోహిత్ శర్మ ఉండేవాడు. 2027 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని టీమిండియా మేనేజ్మెంట్ రోహిత్ శర్మకు డీ మోషన్ ఇచ్చింది. అతడిని ఆటగాడిగా మాత్రమే పరిమితం చేసింది. దీంతో రోహిత్ ప్రస్తుతం వన్డే జట్టులో ఆటగాడిగానే మిగిలిపోయాడు. రోహిత్ కు తోడుగా జట్టులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. వీరిద్దరూ ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టారు. టీమిండియా ట్రోఫీ అందుకోవడంలో తమ వంతు పాత్ర పోషించారు. మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్ ను టీమిండియా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి ఆస్ట్రేలియా జట్టు మీద బలమైన ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ ఇండియా గట్టి పట్టుదలతో ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ నిర్వహించిన మేజర్ టోర్నీలలో ఆస్ట్రేలియా మీద టీం ఇండియా ఘన విజయాలు సాధించింది. అంతేకాదు టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో టీమ్ ఇండియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
ఆస్ట్రేలియాతో సిరీస్ అనగానే టీమిండియా లో ముగ్గురు ప్లేయర్లు రెచ్చిపోతారు. అందులో సచిన్ టెండూల్కర్ ముందు వరుసలో ఉన్నాడు. సచిన్ ఆస్ట్రేలియా జట్టుపై 71 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 3077 పరుగులు ఉన్నాయి. యావరేజ్ 44.59 గా ఉంది. ఇందులో తొమ్మిది సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 175 పరుగులు.సచిన్ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ 50 మ్యాచులు ఆడాడు. 2451 పరుగులు చేశాడు. ఇతడు యావరేజ్ 54.46 గా ఉంది. ఇతడి ఖాతాలో 8 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 123 పరుగులు. కోహ్లీ తర్వాత స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ 46 మ్యాచ్ లు ఆడి 2407 పరుగులు చేశాడు. ఇతడి యావరేజ్ 57.30, 8 సెంచరీలు చేశాడు. ఇతడి అత్యధిక స్కోరు 209 పరుగులు. వాస్తవానికి ఆస్ట్రేలియా గడ్డపై పోరు అంటే నేటి కాలంలో విరాట్, రోహిత్ రెచ్చిపోతారు. ఎందుకంటే ఆస్ట్రేలియా పిచ్ లు వీరిద్దరికి కొట్టినపిండి. దుమ్ము రేపే రేంజ్ లో వీరిద్దరూ బ్యాటింగ్ చేస్తారు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు.
ప్రస్తుతం జట్టులో యువ, అనుభవజ్ఞులైన ప్లేయర్లో ఉండడంతో టీమ్ ఇండియాకు అడ్వాంటేజ్ గా ఉండనుంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత.. ఆస్ట్రేలియాతో తలపడిన ఐసీసీ మేజర్ టోర్నీలలో టీమిండియా సత్తా చాటింది. బలమైన ఆస్ట్రేలియాను ఓడించింది. తొలి వన్డే జరుగుతున్న పెర్త్ పిచ్ లో టీమిండియా 2024 లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయం సాధించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా అద్భుతమైన గెలుపును దక్కించుకుంది. తొలి వన్డేలో కూడా అదే స్థాయిలో ప్రతిభ చూపించాలని టీమిండియా భావిస్తోంది.