Rohit Sharma: గత ఏడాది చివర్లో టీమిండియా ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆస్ట్రేలియా జట్టుతో ఆడింది.. గత రెండు సీజన్లలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకున్న టీం ఇండియా… ఈ సీజన్లో మాత్రం విఫలమైంది. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ గా ఉన్నప్పటికీ.. టీమిండియా న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో వైట్ వాష్ కు గురయ్యి.. ఆస్ట్రేలియా దేశంలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా కోల్పోయింది. ముఖ్యంగా సిడ్నీ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడలేదు. ఆ టెస్టులో టీమ్ ఇండియాకు తాత్కాలిక కెప్టెన్ గా బుమ్రా వ్యవహరించాడు. నాడు సిడ్ని టెస్టులో రోహిత్ ఆడకపోవడం పట్ల రకరకాల వ్యాఖ్యలు వినిపించాయి. వాటికి అటు రోహిత్.. ఇటు టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read: రాజస్థాన్ పై ఢిల్లీ బ్యాటింగ్.. అసలు హైలెట్స్ ఇవే
ఇన్నాళ్లకు నోరు విప్పాడు
తాను సిడ్ని టెస్ట్ ఎందుకు ఆడలేదో ఇన్నాళ్లకు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నోరు విప్పాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైఖేల్ క్లార్క్ బియాండ్ 23 క్రికెట్ అనే యూ ట్యూబ్ చానెల్ కోసం నిర్వహించిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మైకేల్ క్లార్క్ సిడ్ని టెస్ట్ గురించి ప్రస్తావించాడు. దీనికి రోహిత్ శర్మ ఏ మాత్రం తడముకోకుండా సమాధానం చెప్పాడు..” సిడ్నీ టెస్ట్ కి ముందు నా బ్యాటింగ్ ఏమాత్రం బాగోలేదు. అందువల్లే ఆ టెస్టులో తప్పుకున్నాను. నా స్థానంలో గిల్ ఆడితే బాగుంటుంది అనుకున్నాను. ఇదే విషయాన్ని జట్టు మేనేజ్మెంట్ ముందు ఉంచడానికి ప్రయత్నించాను. జట్టు ముందుకు వెళ్లడానికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో మీరే ఆలోచించండి. గిల్ గురించి జట్టు కోచ్, సెలక్టర్ తో చెప్పాను.. అయితే అంతిమంగా నిర్ణయం మాత్రం వారి చేతుల్లోనే పెట్టాను. ఆ తదుపరి ఏ నిర్ణయం తీసుకుంటారనేది వారి ఇష్టానికి వదిలిపెట్టానని” రోహిత్ క్లార్క్ తో చెప్పాడు. అయితే ఆ మ్యాచ్లో గిల్ కు జట్టు మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వలేదు. అయినప్పటికీ ఆ మ్యాచ్లో టీమిండియా గెలవలేదు.. పైగా తాత్కాలిక కెప్ట బుమ్రా వెన్నునొప్పి గాయంతో మధ్యలోనే మైదానం నుంచి వెళ్లిపోయాడు. దీంతో తాత్కాలిక కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు. ఆ తర్వాత బుమ్రా డ్రెస్సింగ్ రూమ్ కి పరిమితం అయ్యాడు. వెన్ను నొప్పి తగ్గకపోవడంతో సుదీర్ఘకాలం అతడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందాడు. మరోవైపు రోహిత్ శర్మ ఆస్ట్రేలియా తో ఓటమి తర్వాత తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ పై కాస్త ఒత్తిడి తగ్గింది.
Also Read: నాడు కోల్ కతాకు.. నేడు ఢిల్లీకి.. స్టార్క్ ఓ వజ్రాయుధం