DC VS RR : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతున్నది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అభిషేక్ పోరెల్, జాక్ ఫ్రేజర్ మెక్ గూర్క్ ఓపెనర్లుగా వచ్చారు. తొలి ఓవర్ జోఫ్రా ఆర్చర్ వేశాడు. పది పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత రెండో ఓవర్ తుషార్ దేశ్ పాండే వేశాడు. ఈ ఓవర్లో అభిషేక్ పోరెల్ చెలరేగిపోయాడు. ఆకాశమే హద్దుగా బ్యాటింగ్ చేశాడు. తుషార్ దేశ్ పాండే వేసిన ఈ ఓవర్ లో 4, 4, 6, 4, 4, 1 మొత్తంగా 23 పరుగులు పిండుకున్నాడు.. ఫలితంగా అప్పటిదాకా 6 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసిన అభిషేక్ పోరెల్.. ఒకసారిగా ఏడు బంతులకు తన వ్యక్తిగత స్కోరును 24 పరుగులకు పెంచుకున్నాడు. అభిషేక్ పోరెల్ కొట్టిన కొట్టుడుకు రాజస్థాన్ ఫీల్డర్లు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. బౌండరీ మీటర్ చిన్నబోయినట్టు.. బంతిమీద దీర్ఘకాలం శత్రుత్వం ఉన్నట్టు అభిషేక్ పోరెల్ బ్యాటింగ్ చేశాడు. ఒక పరుగు తేడాతో హాఫ్ సెంచరీ కోల్పోయినప్పటికీ.. ఉన్నంతసేపు అభిషేక్ పోరెల్ దుమ్ము రేపాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 49 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉండగా.. హసరంగా బౌలింగ్ లో రియాన్ పరాగ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
Also Read : డాట్ బాల్స్ లో దుమ్ము రేపుతున్న చెన్నై బౌలర్.. ఒకే ఒక్కడిగా రికార్డు
నిరాశపరచిన కరుణ్ నాయర్
ఇటీవల ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో 40 బంతుల్లో 89 పరుగులు చేసి ఒక్కసారిగా చర్చనీయాంశమైన కరుణ్ నాయర్ ఈ మ్యాచ్లో మాత్రం తేలిపోయాడు. అనవసరమైన పరుగుకు యత్నించి రన్ అవుట్ అయ్యాడు.. ఖాతా తెరవకుండానే చేరుకున్నాడు. ఇటీవల బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో అదరగొట్టిన కే ఎల్ రాహుల్.. ఈ మ్యాచ్లో 38 పరుగులు చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (34) ఉన్నంతలో దూకుడుగా ఆడాడు. స్టబ్స్(34* ), అశుతోష్ శర్మ (15* ) పరుగులు చేశారు.. చివర్లో స్టబ్స్, శర్మ ఆరో వికెట్ కు 19 బంతుల్లో అజేయంగా 42 పరుగులు జోడించారు. మొత్తంగా ఢిల్లీ జట్టు 20 ఓవర్లు పూర్తిస్థాయిలో బ్యాటింగ్ చేసి, ఐదు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జోప్రా ఆర్చర్ 2 వికెట్లు సాధించాడు. హసరంగ, తీక్షణ చెరో వికెట్ పడగొట్టారు.
Also Read : ఐపీఎల్ లో ఫిక్సింగ్ కు హైదరాబాద్ వ్యాపారి కుట్ర.. వెలుగులోకి సంచలన నిజాలు..