Mumbai Indians: అమీర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన త్రీ ఇడియట్స్ సినిమాకి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్ పాత్రలో కరీనాకపూర్ నటించారు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. అమీర్ ఖాన్ కెరియర్ లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించి రెండవ భాగం ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ.. దీనిపై ఎటువంటి ప్రకటన రాజ్ కుమార్ హిరానీ, అమీర్ ఖాన్ చేయలేదు. అయితే ఇన్నాళ్లకు రాజ్ కుమార్ హిరానీ త్రీ ఇడియట్స్ 2.0 కు దర్శకత్వం వహిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే అందులో వాస్తవం లేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే తాజాగా రాజ్ కుమార్ హిరానీ మెగా ఫోన్ పట్టుకున్నారు. ఆయన డైరెక్షన్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ కనిపించారు. నిజానికి అందరూ అది త్రీ ఇడియట్స్ 2.0 అని అనుకున్నారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తోంది సినిమాకి కాదు..
Also Read: రాజస్థాన్ పై ఢిల్లీ బ్యాటింగ్.. అసలు హైలెట్స్ ఇవే
వాణిజ్య ప్రకటన
ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. ముంబై జట్టులో రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ కీలకమైన ఆటగాళ్లుగా ఉన్నారు. వీరి ముగ్గురు ఓ కార్పొరేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా షూట్లో పాల్గొన్నారు. ఈ ప్రకటనకు ప్రఖ్యాత దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షూట్లో సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, రోహిత్ శర్మ పాల్గొన్నారు.. అయితే వారు ముగ్గురు ఏ ప్రకటనలో నటించారు? ఏ కంపెనీ ఉత్పత్తి కోసం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు? అనే ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానం తెలియాల్సి ఉంది. మొత్తానికి ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ముంబై అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ” ముంబై జట్టుకి చెందిన త్రిమూర్తులు ఒకే ఫ్రేమ్లో ఉన్నారు. వారి ముగ్గురిని చూస్తే ఆనందం కలుగుతున్నది. వారు నటించిన ప్రకటన కూడా అద్భుతంగా ఉంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదని” ముంబై అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. “ఒకవేళ వీరు ముగ్గురు త్రీ ఇడియట్ సినిమాకు 2.0 వెర్షన్ తీస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ సినిమాలో గొప్ప నీతి ఉంది. అప్పట్లోనే అది సంచలనం సృష్టించింది. ఇప్పుడైతే సరికొత్త రికార్డులు సాధిస్తుంది. పైగా రోహిత్, సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యాకు బలమైన అభిమానుల అండదండలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ సినిమా ఒకవేళ పట్టాలు ఎక్కితే కచ్చితంగా విజయం సాధిస్తుంది. కాకపోతే ఈ సినిమా తీసే టైం అటు ఆ ముగ్గురికి..ఇటు రాజ్ కుమార్ హిరానీకి లేదని” అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: నాడు కోల్ కతాకు.. నేడు ఢిల్లీకి.. స్టార్క్ ఓ వజ్రాయుధం