Rohith Sharma
Rohit Sharma : తిలక్ వర్మ, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, బుమ్రా, ర్యాన్ రికెల్టన్, శాంట్నర్ వంటి ఆటగాళ్లతో అత్యంత బలంగా కనిపిస్తోంది. ఈ జట్టును రిలయన్స్ కంపెనీ నిర్వహిస్తోంది. డబ్బు పరంగా.. ఆటగాళ్లపరంగా ఈ జట్టుకు పెద్దగా లోటు లేదు. పైగా ఐదుసార్లు విజేతగా నిలిచిన ఘన చరిత్ర కూడా ఉంది. అయితే అటువంటి ఈ జట్టు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 18వ ఎడిషన్ లో ఒక్క విజయం కోసం తాపత్రయ పడుతోంది. బలమైన ఆటగాళ్లు ఉన్నాయి జట్టు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 18వ ఎడిషన్ లో ఒక్క విజయం కోసం కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తోంది. పాయింట్ల పట్టికలో ఈ జట్టు చివరి స్థానంలో ఉంది.. ఆడిన రెండు మ్యాచ్లలో ఓటమిపాలై పరువు తీసుకుంది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది. రెండో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు ముందు తలవంచింది.. రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో -1.163 నెట్ రన్ రేట్ తో పదో స్థానంలో ఉండడంతో ముంబై ఇండియన్స్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఈ దశలోనే సోషల్ మీడియా వేదికగా కొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు.. దీంతో సోషల్ మీడియాలోనే కాదు ప్రధాన మీడియాలోనూ ఈ విషయంపై విస్తృతంగా చర్చ నడుస్తోంది.
Also Read : ఆంధ్ర ప్రదేశ్ కి కొత్త IPL టీం..? సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక ఉండదా?
అతడికి కెప్టెన్సీ ఇవ్వాలి
ముంబై జట్టును తిరుగులేని స్థాయిలో నిలిపిన ఘనత ముమ్మాటికి రోహిత్ శర్మ దే. ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో నీతా అంబానీ, ముకేశ్ అంబానీ, ఆకాశ్ అంబానీ వెల్లడించారు.. గత సీజన్లో ముంబై జట్టు యాజమాన్యం హఠాత్తుగా కెప్టెన్ రోహిత్ శర్మను ఆ స్థానం నుంచి తొలగించింది. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించింది. ఇక అప్పటినుంచి జట్టులో విభేదాలు మొదలయ్యాయి. ముంబై ఇండియన్స్ జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందని విమర్శలు వినిపించాయి. మైదానంలో హార్దిక్ పాండ్యా – రోహిత్ శర్మ కలిసి ఉన్నట్టుగా కనిపించినప్పటికీ.. ఇద్దరి మధ్య తారాస్థాయిలో విభేదాలు ఉన్నాయని స్పోర్ట్స్ వర్గాలు కోడై కూశాయి. దానికి తగ్గట్టుగానే జట్టు ప్రదర్శన కూడా ఉండడంతో అందరూ అవే నిజమని భావించారు. ఇక తాజా ఎడిషన్ లో ముంబై జట్టు ఒక్క విజయం కూడా సొంతం చేసుకోలేదు. దీంతో హార్దిక్ పాండ్యాను కెప్టెన్ స్థానం నుంచి తొలగించి.. రోహిత్ శర్మను తిరిగి ఆస్థానంలో నిలపాలని ముంబై జట్టు అభిమానులు కోరుతున్నారు. ” హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై జట్టు ఏమాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోతోంది. దీనివల్ల జట్టు కు ఉన్న పేరు పాతాళంలోకి పడిపోతుంది. ఇలాంటప్పుడు జట్టు మేనేజ్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలి. జట్టును బలోపేతం చేయాలి. రోహిత్ శర్మకు నాయకత్వం అప్పగించి బలోపేతం చేయాలి. లేకపోతే ఈ ఐపీఎల్లో కూడా ముంబై జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించే ప్రమాదం ఉంది. 2023 సీజన్లో గుజరాత్ జట్టు రన్నరప్ అయింది. 2022 సీజన్లో విజేతగా నిలిచింది. ఆ రెండుసార్లు కూడా హార్దిక్ పాండ్యా గుజరాత్ జట్టును నడిపించాడు. అందువల్లే ముంబై యాజమాన్యం అతడి వైపు ఆసక్తి చూపించింది. కానీ గుజరాత్ జట్టును నడిపించినట్టు ముంబై ఇండియన్స్ జట్టును హార్దిక్ నడిపించలేకపోతున్నాడు.. ఇప్పటికైనా ముంబై యజమాన్యం తీరు మార్చుకోవాలని” ముంబై ఇండియన్స్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు
Also Read : CSK, MI పని అయిపోయినట్టేనా..