Shubha Muhurtham : ఉగాది పండుగ తో తెలుగు సంవత్సరం ప్రారంభమైంది. ఇదే సమయంలో కొత్త పంచాంగం కూడా ఆవిష్కరణ అయింది. ఉగాది రోజున ఆలయాలు, ప్రత్యేక కూడళ్లలో కొత్త పంచాంగాన్ని వినిపించారు. అయితే చాలామంది తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకున్నారు. ముఖ్యంగా కొత్త ఏడాదిలో శుభముహూర్తాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉండేది. దీంతో పండితులు కొత్త సంవత్సరంలో ఉన్న శుభ ముహూర్తాల గురించి తెలిపారు. అయితే పెళ్లిళ్లు, శుభకార్యాలు నిర్వహించుకునేవారు మంచి రోజులు ఎలా ఉన్నాయో తెలిస్తే ప్రీ ప్లాన్ గా ఉంటారు. అందువల్ల ఈ ఏడాదిలో మంచి రోజులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. కొత్త పంచాంగం ప్రకారం మంచి రోజులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Also Read : ముంబై గెలవాలంటే రోహిత్ కు కెప్టెన్సీ ఇవ్వాల్సిందే!
2025 మార్చి 30 నుంచి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఏడాదిలో ఏప్రిల్ నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. ఏప్రిల్ నెలలో 6,16, 18, 20, 23 ,30 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయి. అలాగే మే నెలలో ఒకటి ఎనిమిది తొమ్మిది 1, 8, 9, 11, 17, 18, 28 తేదీల్లో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు అని పండితులు తెలుపుతున్నారు. ఇక జూన్ నెలలో 1,2,5,6,7,8 తేదీల్లో… జూలైలో 16,30 రోజుల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు నెలలో 1,4,7,8,9,10,13,14,17 రోజుల్లో.. సెప్టెంబర్ 26,27 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే అక్టోబర్ నెలలో 1,2,3,4,6,8,10,11,22,24 తేదీల్లో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు అని పండుగలు తెలిపారు. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో శూన్యమాసముగా ఉంటున్నాయి. 2026 ఫిబ్రవరి నెలలో 19,20,21,22,25,26,27 తేదీల్లో మంచి రోజులు ఉండనున్నాయి. మార్చి 4,5,7,8,11 తేదీలలో శుభముహూర్తాలుగా పేర్కొన్నారు.
మొత్తంగా ఈ ఏడాదిలో నవంబర్, డిసెంబర్, జనవరి మూడు నెలల మినహా మిగతా దాదాపు అన్ని నెలల్లో మంచి రోజులు ఉన్నట్లు కొత్త జాతకం తెలుపుతుంది. అయితే పెళ్లిల ముహూర్తాలు ప్రత్యేకంగా ఉంటాయి. అందువల్ల ఈ మంచి రోజుల ఆధారంగా పెళ్లి ముహూర్తాలను పండితులు మాత్రమే నిర్ణయిస్తారు. ఎందుకంటే వివాహ ముహూర్తాలు వారి జాతకాల ప్రకారం నిర్ణయిస్తారు. మిగతా కార్యక్రమాల కోసం వీటిని మంచి రోజులుగా భావించవచ్చు. అయినా ఏదైనా శుభకార్యం నిర్వహించుకునే సమయంలో ఈ రోజుల ఆధారంగా పండితులను కలిసి అసలైన ముహూర్తాల గురించి తెలుసుకోవాలని అంటున్నారు.
మొత్తంగా ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆ తర్వాత 2026 ఫిబ్రవరి నెలలో ఎక్కువ ముహూర్తాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆగస్టు నెలలోనూ మంచి ముహూర్తాలే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అందువల్ల ఏదైనా శుభకార్యం నిర్వహించుకునేవారు ఈ నెలలను ఎంచుకోవచ్చు అని చెబుతున్నారు. ముఖ్యంగా వివాహాలు నిర్వహించాలని అనుకునేవారు ఈ తేదీన ఆధారంగా శుభ ముహూర్తాలను పెట్టుకోవాలని చెబుతున్నారు. అయితే ఆషాడం వంటి మాసం వచ్చిన సమయంలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించుకోవాలి. మిగతా శుభకార్యాలకు ఆయా నెలలో నిర్వహించుకోవాల్సి వస్తే పండితులను సంప్రదించి అసలైన రోజులను తెలుసుకోవాలి.
Also Read : వసంత నవరాత్రి ఉత్సవాలను ఎలా జరుపుకుంటారు? ఎలాంటి నియమాలు ఉంటా