https://oktelugu.com/

IPL Team : ఆంధ్ర ప్రదేశ్ కి కొత్త IPL టీం..? సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక ఉండదా?

IPL Team : ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త IPL టీం రానుందా?, సన్ రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) టీం పూర్తిగా వైజాగ్ వారియర్స్ గా మారిపోనుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.

Written By: , Updated On : March 31, 2025 / 03:28 PM IST
IPL Team

IPL Team

Follow us on

IPL Team : ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త IPL టీం రానుందా?, సన్ రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) టీం పూర్తిగా వైజాగ్ వారియర్స్ గా మారిపోనుందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే అలా జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే రీసెంట్ గానే సన్ రైజర్స్ టీం యాజమాన్యం HCA పై సంచలన ఆరోపణలు చేసింది. ‘HCA మమ్మల్ని టికెట్స్ కోసం సతాయిస్తున్నారు. టికెట్స్ విషయంలో చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే వాళ్లకు మేము 3900 కాంప్లిమెంటరీ టికెట్స్ అందిస్తున్నాము. అవి సరిపోవు మాకు ఇంకా కావాలని చంపుకు తింటుంది. ఇలా అయితే మేము వేరే చోటకు వెళ్ళిపోతాము, మేము భరించలేము’ అంటూ చెప్పుకొచ్చాడు. నేరుగా సన్ రైజర్స్ యాజమాన్యం ఈ రేంజ్ వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇన్నేళ్ల IPL హిస్టరీ లో ఒక టీం ఈ విధమైన కామెంట్స్ చేయడమనేది ఎప్పుడూ జరగలేదు.

Also Read : CSK, MI పని అయిపోయినట్టేనా..

నిన్న వైజాగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగగా, ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. చాలా కాలం నుండి వైజాగ్ లో మ్యాచులు జరుగుతూనే ఉన్నాయి. త్వరలోనే అమరావతి లో దేశంలోనే రెండవ అతి పెద్ద క్రికెట్ స్టేడియం రానుంది. అది తయారయ్యేలోపు మన ఆంధ్ర ప్రదేశ్ కి కొత్త IPL టీం వస్తుందని అంటున్నారు. అది అమరావతి ని బేస్ చేసుకొని ఉండొచ్చు, లేకపోతే వైజాగ్ ని బేస్ చేసుకొని ఉండొచ్చు. చాలా కాలం క్రితం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక IPL టీం ని నడపబోతున్నాడని వార్తలు వినిపించాయి. వాటిల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ఒక ప్రాంతానికి సంబంధించి టీం ఏర్పాటు కావాలంటే కచ్చితంగా ఆ ప్రాంతంలో క్రికెట్ స్టేడియం ఉండాలి. వైజాగ్ లో ఎన్నో ఏళ్ళ నుండి క్రికెట్ స్టేడియం ఉన్నప్పటికీ మనకంటూ ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు కాలేదు.

గట్టిగా పూనుకుంటే మనకంటూ ఒక ప్రత్యేకమైన IPL టీం ఉంటుంది. కానీ ఎవ్వరూ కూడా బలంగా పూనుకోలేదు, ఫలితంగా మనకు టీం ఏర్పడలేదు. అయితే అందుతున్న లేటెస్ట్ సమాచారం ఏమిటంటే వచ్చే IPL సీజన్ లోపు రెండు నుండి మూడు కొత్త టీమ్స్ వస్తాయని, అందులో మన ఆంధ్ర ప్రదేశ్ కూడా ఒకటి ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్ నుండి వెళ్లిపోతామని సన్ రైజర్స్ టీం హెచ్చరించడం తో, ఆ టీమే వైజాగ్ టీం అవ్వొచ్చు. క్రికెట్ లో ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి, చూడాలి ఏమి జరగబోతుంది అనేది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మూడు మ్యాచులు ఆడితే, అందులో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. దీనిపై సోషల్ మీడియా లో అనేక ట్రోల్స్ వస్తున్నాయి.

Also Read : ముంబై కెప్టెన్‌కు చుక్కలు! హార్దిక్‌పై రూ.12 లక్షల జరిమానా