Rohit Sharma: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ప్రస్తుతం కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అతడు విదేశాలలో ఉన్నాడు. కుమార్తె, కుమారుడు, భార్య తో కలిసి విదేశాలలో విహరిస్తున్నాడు. ఈ క్రమంలో అభిమానులకు అరుదైన కానుక అందించాడు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
టీమ్ ఇండియా సారధిగా ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టును ముందుండి నడిపించాడు రోహిత్ శర్మ. అంతేకాదు ఆ ట్రోఫీలో విజేతగా జట్టును నిలబెట్టాడు. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వాస్తవానికి రోహిత్ భీకరమైన ఫామ్ లో ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ అతడిని పక్కన పెట్టింది.. సారధి స్థానంలో గిల్ ను నియమించింది. దీంతో రోహిత్ జట్టులో ఒక ఆటగాడి గానే మిగిలిపోయాడు. రోహిత్ ఇటీవలి ఆస్ట్రేలియా సిరీస్లో అదరగొట్టాడు.. సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి తన పూర్వపు లయను అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టినప్పటికీ రోహిత్ ఏమాత్రం బెదిరిపోలేదు. ఆస్ట్రేలియా బౌలర్ల ముందు అదిరిపోలేదు.. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి పరుగులు రాబట్టాడు.
రోహిత్ సూపర్ బ్యాటింగ్ వల్ల టీమిండియా జట్టుతో జరిగిన మూడో వన్డేలో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.. ఇక ప్రస్తుతం కుటుంబంతో విదేశీ పర్యటనలో ఉన్నాడు రోహిత్ శర్మ.. పైగా తన కుమారుడు అహన్ పుట్టినరోజు వేడుకలను విదేశాలలో నిర్వహించాడు. దానికి సంబంధించిన ఫోటోలను అతడు తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశాడు.. సమయం ముందుకు వెళ్తోంది. వేగంగా పరుగులు పెడుతోంది. ఇంతటి వేగంలో కూడా ప్రతిక్షణాన్ని మేము ఆస్వాదిస్తున్నామని” రోహిత్ ఇంస్టాగ్రామ్ లో పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ సారధిగా తనను పక్కన పెట్టినప్పటికీ ఆడే విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపించడం లేదు.. జట్టు కోసం ఆడే విషయంలో అదే నిబద్ధతను ప్రదర్శిస్తున్నాడు.. ఒకప్పటి తన ఆట తీరును కనబరుస్తున్నాడు.. అందువల్లే రోహిత్ ఇప్పటికీ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. అతడు ఇలానే ఆడాలని.. మరిన్ని ఎక్కువ పరుగులు చేసి టీమ్ ఇండియాకు వన్డే వరల్డ్ కప్ అందించాలని సగటు అభిమాని కోరుతున్నాడు.