Varanasi Movie Event: బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన దర్శకుడు రాజమౌళి… ఇండియన్ మూవీ హిస్టరీ లోనే బాహుబలి ఒక వండర్ ను క్రియేట్ చేసింది. సినిమా ఇండస్ట్రీ అంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అనే రేంజ్ లో చెప్పుకునే స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో రాజమౌళి ట్రెండ్ సెట్ చేసి చూపించాడు. ఒక సినిమాకు భారీ బడ్జెట్ పెడితే దానికి తగ్గట్టుగా కష్టపడితే అది ఈజీగా రికవరీ చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు. ముఖ్యంగా తెలుగు సినిమా హిస్టరీలోనే బాహుబలి క్రియేట్ చేసిన వండర్స్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి వెళ్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా రాజమౌళి సినిమాలకు ఒక మార్క్ అయితే ఉంటుంది.
సినిమా టైటిల్ లోనే ఆయన మార్క్ వేస్తుంటారు. ఆ మార్క్ కనిపించింది అంటే ప్రేక్షకుడు హ్యాపీగా అతని సినిమాకెళ్లి రెండున్నర గంటల పాటు ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక అభిప్రాయం తో ఉంటాడు. అందుకే రాజమౌళికి 100% సక్సెస్ రేట్ ఉండడమే కాకుండా ప్రేక్షకుల్లో కూడా విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ఆయన నుంచి ఒక సినిమా వస్తోంది అంటే చాలు అది పక్కా గా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు.
ఇక ఈ క్రమంలోనే దేశంలో ఉన్న ప్రతి ఒక్క నటుడు అతని సినిమాలో అవకాశం వస్తే చాలు ఎంత చిన్న పాత్ర అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్పడం విశేషం… ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలా విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి సినిమాకి భారీ ఎత్తున ఈవెంట్ ప్లాన్ చేశాడు.
ఇక ఈ ఈవెంట్ సక్సెస్ ఫుల్ గా సాగింది. నిజానికి ఈవెంట్ కి హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ చీఫ్ గెస్ట్ గా రావాల్సింది. కానీ అవతార్ 3 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆయన బిజీగా ఉండడం వల్ల రాలేకపోయాడు. అయితే మరో ఆరు నెలల తర్వాత ఈ సినిమా టీజర్ ని జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాలని రాజమౌళి చూస్తున్నాడు. అదే కనుక జరిగితే మాత్రం ఈ సినిమాకి హాలీవుడ్ లో కూడా భారీ బజ్ క్రియేట్ అవుతోంది…