MI vs RR : ఐపీఎల్ లో అనేక విమర్శలు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ జట్టు.. సోమవారం రాజస్థాన్ జట్టుతో జరిగే లీగ్ మ్యాచ్ కు సిద్ధమైంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఓడిపోయి ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. కొత్త కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించడంతో ఆ జట్టుకు సంబంధించి రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టుకు ఓ విజయం అనివార్యం. ఈ నేపథ్యంలో సోమవారం రాజస్థాన్ జట్టుతో ముంబై ఇండియన్స్ జట్టు వాంఖడే మైదానంలో తలపడనుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని ముంబై జట్టు భావిస్తోంది.. ఆ జట్టు ఆటగాళ్లు మైదానంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇక సొంత మైదానంలో చెలరేగేందుకు ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సంసిద్ధంగా ఉన్నాడు.
మ్యాచ్ లో భాగంగా రోహిత్ శర్మ ముంబై టీం బస్సులో కాకుండా.. తన రేంజ్ రోవర్ కారులో మైదానానికి చేరుకున్నాడు. 264 అనే ప్రత్యేక నెంబర్ ప్లేట్ ఉన్న కారులో రోహిత్ ప్రయాణించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.. రోహిత్ శర్మకు సంబంధించి ప్రతి అంశాన్ని స్థూలంగా శోధించే నెటిజన్లు చివరికి ఆ నెంబర్ ప్లేట్ విషయంలో సంచలన విషయం కనుగొన్నారు. దీంతో అది హాట్ టాపిక్ గా మారింది.
రోహిత్ ప్రయాణించిన రేంజ్ రోవర్ కార్ నెంబర్ ప్లేట్ లో 264 అనే నెంబర్ ప్రత్యేక అక్షరాలతో ఉంది. అయితే అది సాధారణ నెంబర్ కాదు. వన్డే క్రికెట్లో రోహిత్ శర్మ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ కు ఆదిసంకేతం. 2014లో కోల్ కతా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ ఏకంగా 264 పరుగులు చేశాడు. వన్డేల్లో అది అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇప్పటికీ వన్డేల్లో అదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ గా రికార్డుల్లో ఉంది. ఆ మ్యాచ్ లో వీర విహారం చేయడం ద్వారా రోహిత్ శర్మకు హిట్ మాన్ అనే బిరుదు కూడా లభించింది. ఇక అప్పటినుంచి రోహిత్ శర్మ కెరియర్ మరో మలుపుతీసుకుంది అప్పటిదాకా టీమిండియాలో స్థానం దక్కించుకుంటూ, పోగొట్టుకుంటూ సాగిన అతని ప్రయాణం.. ఆ తర్వాత సుస్థిరమైంది. రోహిత్ లేకుండా టీమిండియా మ్యాచ్ ఆడే పరిస్థితి లేకుండా పోయింది. ఆ తర్వాత కెప్టెన్ కావడం.. టీమిండియా కు అద్భుతమైన విజయాలు అందించడం తెలిసిందే.
రేంజ్ రోవర్ కార్ లో రోహిత్ శర్మ ఎంట్రీ ఇవ్వడం పట్ల అతడి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సింహం లాంటి కారులో హిట్ మాన్ వచ్చాడంటూ కితాబిస్తున్నారు. సింహం ఎక్కడున్నా సింహమేనని, కెప్టెన్సీ నుంచి తొలగించినంత మాత్రాన రోహిత్ శర్మ చరిష్మా తగ్గలేదని అతని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Hitman Rohit Sharma driving his latest Range Rover
We don't want 200 here @ImRo45 pic.twitter.com/GRKjqoKoMf
— Nisha (@NishaRo45_) March 31, 2024