Rohit Sharma : “రోహిత్ శర్మ ఆరోగ్యంగానే ఉన్నాడు. కాకపోతే అతడు దూకుడుగా ఆడక పోవడం వల్లే లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో దూరం పెట్టారని” సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీటిని కొంతమంది నిజం అనే విధంగానే ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో ఏది నిజమో? ఏది అబద్దమో? తెలుసుకోలేక అభిమానులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక లక్నో జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో మైదానంలో రోహిత్ శర్మ కనిపించాడు. సూర్య కుమార్ యాదవ్, అంతకుముందు నమన్ ధీర్ చేసిన బ్యాటింగ్ ను అతడు ఆస్వాదించాడు. నమన్ ధీర్ అవుట్ అయినప్పుడు రోహిత్ ఒక్కసారిగా ఆందోళన చెందాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపించాయి. రోహిత్ పలు సందర్భాల్లో నవ్వుతూ కనిపించడంతో.. అతని అభిమానుల్లో రకరకాల ప్రశ్నలు మెదిలాయి. గాయం కాలేదని.. ఫామ్ లో లేకపోవడం వల్లే అతడిని పక్కన పెట్టారనే వాదనలకు అవి బలం చేకూర్చాయి. అయితే తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్లో ఉంది.
Also Read : గాయమా తీసేసారా.. రోహిత్ శర్మ ముంబై ప్లేయింగ్ 11 లో ఎందుకు లేడు?
మోకాలినొప్పితో..
కొంతకాలంగా విశ్రాంతిలేని క్రికెట్ ఆడుతున్నాడు రోహిత్ శర్మ. అయినప్పటికీ అతడు ఎన్నడు కూడా గాయానికి గురి కాలేదు. గాయంతో బాధపడుతున్నట్టు ఎప్పుడూ కనిపించలేదు. అయితే తొలిసారిగా గాయం కారణాన్ని రోహిత్ శర్మ బయటి ప్రపంచానికి చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే రోహిత్ శర్మ తన శరీరానికి గాయాలు అయ్యే విధంగా ఎన్నడూ ఆడలేదు. శరీరాన్ని ఇబ్బంది పెట్టి అతడు బ్యాటింగ్ చేయలేదు. ఫీల్డింగ్.. బ్యాటింగ్.. వికెట్ల మధ్య పరిగెత్తడం వంటి వాటిల్లో రోహిత్ తన శరీరాన్ని కాపాడుకుంటూనే చేశాడు. అయితే రోహిత్ శర్మకు నిజంగానే గాయమైందట.. ఈ విషయం జాతీయ మీడియాలో తెగ ప్రసారం అవుతున్నది.. ముఖ్యంగా ముంబై జట్టు ప్రాక్టీస్ సమయంలో రోహిత్ శర్మ.. మైదానానికి వచ్చాడు. ప్రాక్టీస్ అనంతరం తీవ్రంగా ఇబ్బంది పడుతూ కనిపించాడు. చివరికి మెట్లు కూడా ఎక్కలేని స్థితికి రోహిత్ శర్మ దిగజారాడు. మెట్లు ఎక్కడానికి రోహిత్ శర్మకు ఒక సహాయకుడు సపోర్టుగా ఉన్నాడు. అతని సపోర్ట్ ద్వారానే రోహిత్ మెట్లు ఎక్కగలిగాడు..” రోహిత్ ఆరోగ్యం బాగోలేదు. చివరికి అతనికి మోకాళ్ళ నొప్పి తీవ్రంగా ఉంది. అందువల్లే మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాడు. ఇప్పటికైనా రకరకాల చర్చలు పక్కనపెట్టి.. రోహిత్ అనారోగ్య కోణంలో ఆలోచించాలని.. అతడు తిరిగి ఆరోగ్యవంతుడయ్యేంతవరకు నిశ్శబ్దంగా ఉండాలని” రోహిత్ అభిమానులు సూచిస్తున్నారు. కాగా, మోకాలి నొప్పితో బాధపడుతున్న రోహిత్ శర్మ.. రెండు లేదా మూడు మ్యాచ్ల వరకు ముంబై ఇండియన్స్ జట్టుకు దూరంగా ఉంటాడని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంతవరకు ముంబై ఇండియన్స్ లేదా రోహిత్ శర్మ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
Also Read : ముంబై గెలవాలంటే రోహిత్ కు కెప్టెన్సీ ఇవ్వాల్సిందే!