LSG vs MI : లక్నో జట్టు విధించిన 204 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన ముంబై జట్టు ఐదు వికెట్ల కోల్పోయి.. 191 పరుగులకే పరిమితమైపోయింది.. ముంబై ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్ (67), నమన్ ధీర్(46) దూకుడుగా ఆడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది . చివర్లో లక్నో బౌలర్లు పతనైన బంతులు వేయడంతో పరుగులు తీయడంలో ముంబై జట్టు ప్లేయర్లు విఫలమయ్యారు. దీంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఓపెనర్లు రికెల్టన్(10), విల్ జాక్స్ (5) ముంబై జట్టుకు శుభారంభాన్ని అందించడంలో విఫలమయ్యారు. రికెల్టన్ శార్దుల్ ఠాకూర్.. ఆకాష్ దీప్ బౌలింగ్లో విల్ జాక్స్ అవుట్ అయ్యారు.. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్, నమన్ ధీర్ మూడో వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే దిగ్వేష్ రాటి బౌలింగ్లో నమన్ ధీర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ముంబై జట్టులో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్ ఒక్కసారిగా దూకుడు పెంచాడు. 67 పరుగుల వద్ద భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.. ఇక మరో ఆటగాడు తిలక్ వర్మ కూడా బౌండరీలు, సిక్సర్లు కొట్టడంలో విఫలమయ్యాడు. ఇక మ్యాచ్ చివరి ఓవర్లో ముంబై జట్టు విజయానికి 22 పరుగులు కావాల్సి వచ్చింది. ఈ దశలో తిలక్ వర్మ తప్పుకొని శాంట్నర్ కు అవకాశం ఇచ్చాడు. అయితే చివరి ఓవర్ లో ఆవేశ్ ఖాన్ కట్టుదిట్టంగా బంతులు వేయడంతో ముంబై జట్టు కేవలం 10 పరుగులు మాత్రమే చేసింది. మొత్తంగా 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లక్నో విజయం సాధించడంతో ఆ జట్టు యజమాని సంజీవ్ గొయెంకా చిరునవ్వులు చిందించాడు.
Also Read : వరుసగా రెండు సిక్స్ లు.. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ వదిలి పారిపోయాడు: ట్రోలింగ్
ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు.. 20 ఓవర్లలో 203 పరుగుల భారీ స్కోర్ చేసింది.. లక్నో జట్టులో మిచెల్ మార్ష్(60), మార్క్రం(53) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇక చివరిలో ఆయుష్ బదోని (30), డేవిడ్ మిల్లర్ (27) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దీంతో లక్నో జట్టు స్కోర్ డబుల్ సెంచరీ దాటింది. ప్రస్తుతానికి ఒక దశలో లక్నో జట్టు 170 పరుగుల వరకే ఆగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ చివర్లో ముంబై బోర్డర్లు చేతులెత్తేయడంతో లక్నో జట్టు భారీ స్కోర్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లోనూ లక్నో జుట్టు కెప్టెన్ రిషబ్ పంత్ విఫలమయ్యాడు. రెండు పరుగులు మాత్రమే చేసి హార్థిక్ పాండ్యా బౌలింగ్లో ఔట్ అయ్యాడు. రిషబ్ పంత్ విఫలం కావడంతో సోషల్ మీడియాలో అతడి పై విపరీతమైన విమర్శలు వచ్చాయి. 27 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే ఇలా ఆడుతున్నవ్ ఎందుకని లక్నో జట్టు అభిమానులు అతనిపై మండిపడ్డారు.
Also Read : ప్రాక్టీస్ పక్కన పెట్టి.. గ్రౌండ్ లో ఇషాన్ కిషన్, డేవిడ్ కొట్లాట.. వీడియో వైరల్..