India Vs Sri Lanka 2nd odi: శ్రీలంకపై టి20 సిరీస్ ను వైట్ వాష్ చేసి సత్తా చాటిన టీమిండియా.. వన్డేలలో ఆ జోరు చూపించలేకపోతోంది. తొలి వన్డే అర్ష్ దీప్ సింగ్ వల్ల టై గా మారగా.. రెండో వన్డే మిడిల్ ఆర్డర్ వైఫల్యం వల్ల ఓడిపోవాల్సి వచ్చింది. దీంతో టీమిండియా ఆట తీరు పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓపెనర్లు మెరుగైన ఇన్నింగ్స్ ఆడుతున్నప్పటికీ.. మిగతా ఆటగాళ్లు విఫలమవుతున్నారు. ఇదే సమయంలో శ్రీలంక బౌలర్లు పండగ చేసుకుంటున్నారు.. రెండవ వన్డేలో శ్రీలంక 34 పరుగుల తేడాతో ఓడిపోయిందంటే దానికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫల్యమే. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్ వంటి వారు దారుణంగా విఫలమయ్యారు.. కీలకమైన ఇన్నింగ్స్ ఆడాల్సిన చోట చేతులెత్తేశారు.. దీంతో టీమ్ ఇండియా రెండవ వన్డేలో ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పటికే తొలి వన్డే టై అయింది..
ఇక రెండవ వన్డేలో శ్రీలంక ఇన్నింగ్స్ సమయంలో కొలంబోలోని ప్రేమదాస మైదానంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. టీమిండియా స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పై కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. మైదానంలో అందరూ చూస్తుండగానే దూసుకొచ్చాడు. నిన్ను కొడతాను రా బాబూ అంటూ స్లిప్ లో ఉన్న అతడు ఔట్ ఫీల్డ్ వరకు దూసుకొచ్చాడు. ఇందుకు కారణం లేకపోలేదు. వాషింగ్టన్ సుందర్ ఒక తప్పును పునరావృతం చేయడంతో రోహిత్ సహనాన్ని కోల్పోయాడు. ఒక చేతిని పైకి లేపి ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కొడతానంటూ హెచ్చరించాడు.
శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా సుందర్ 33 ఓవర్ వేశాడు. ఈ ఓవర్లో రెండుసార్లు తన రనప్ కోల్పోయాడు. తొలిసారి తన రనప్ లెంగ్త్ కోల్పోయాడు. దీంతో బంతి వేయకుండానే ఆగిపోయాడు. రెండోసారి కూడా తన బ్యాలెన్స్ ఆపుకోలేక స్లిప్ అయ్యాడు. కింద పడిపోయాడు. అప్పటికే ఇలా మూడుసార్లు కావడంతో రోహిత్ లో కోపం తారస్థాయికి చేరింది. దీంతో స్లిప్లో ఉన్న అతడు గట్టిగా కేకలు వేశాడు. ఇంకోసారి ఇలా చేస్తే కొడతానంటూ హెచ్చరించాడు. చేతిని పైకి లేపి బెదిరించాడు. దీంతో మీతో ఆటగాళ్లు గట్టిగా నవ్వారు. తొలిసారిగా వాషింగ్టన్ సుందర్ ఇలా చేసినప్పుడు రోహిత్ తిట్టాడు. రెండోసారి కూడా అలా చేయడంతో కొట్టేందుకు ముందుకు వచ్చాడు.. దీంతో సుందర్ తనలో తాను నవ్వుకున్నాడు. ఇలా అయితే స్లో ఓవర్ రేట్ కు దారితీస్తుందని, ఆ ఘటన కనుక చోటు చేసుకుంటే తన మ్యాచ్ ఫీజులో కోతపడుతుందని రోహిత్ ఇలా బెదిరించడాని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోయినప్పటికీ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి, ఒక ఓవర్ మెయిడెన్ చేశాడు. 30 పరుగులు ఇచ్చి శ్రీలంక జట్టులోని మూడు కీలకమైన వికెట్లు పడగొట్టాడు.. హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్న అవిష్కా ఫెర్నాండో తో పాటు కుషాల్ మెండీస్ ను ఔట్ చేసి, శ్రీలంకలో కోలుకోకుండా చేశాడు. నిదానంగా ఆడుతున్న అసలంకను పెవిలియన్ పంపించాడు.. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 206 పరుగులకే కుప్ప కూలింది.
Just @ImRo45 being his hilarious self on the field
Watch the action from #SLvIND LIVE now on Sony Sports Ten 1, Sony Sports Ten 3, Sony Sports Ten 4 & Sony Sports Ten 5 #SonySportsNetwork #SLvIND #TeamIndia #RohitSharma pic.twitter.com/5OXrxYrWCu
— Sony Sports Network (@SonySportsNetwk) August 4, 2024