spot_img
Homeఆధ్యాత్మికంHoroscope Today: శ్రావణమాసం ప్రారంభ వేళ.. ఈ రెండు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..

Horoscope Today: శ్రావణమాసం ప్రారంభ వేళ.. ఈ రెండు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..

Horoscope Today: శ్రావణమాసం ప్రారంభ వేళ ద్వాదశ రాశులపై అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా కర్కాటక , తుల రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. శత్రువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో చిక్కులు ఎదుర్కొంటారు. అందువల్ల జాగ్రత్తగా వ్యవహరించాలి.

వృషభ రాశి:
వ్యాపారులకు ఈరోజు అనుకూల సమయం. కాబట్టి దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ఇదే సమయంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలి. ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.

మిథున రాశి:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఎవరి నుంచి డబ్బు ఆశించకుండా ఉండాలి. జీవిత భాగస్వామితో సరదాగా ఉంటారు. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.

కర్కాటక రాశి:
బంధువుల సహాయంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువే. రోజూవారీ అవసరాలు తీర్చడానికి ఆదాయం సమకూరుతుంది. కొందరికి ఆదాయం పెరిగినా.. ఖర్చులు ఉంటాయి. దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న పనులు వెంటనే పూర్తవుతాయి.

సింహారాశి:
పెండింగు సమస్యలను పరిష్కరిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త పెట్టుబుడులు పెడుతారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి.

కన్య రాశి:
విద్యార్థులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారు శుభవార్తలు వింటారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. వీటిని అధిగమించడానికి కష్టపడాల్సి వస్తుంది.

తుల రాశి:
రాజకీయాల్లో ఉన్నవారికి అనుకూల ఫలితాలు. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. విద్యార్థులు కీలక సమాచారాన్ని అందుకుంటారు. ఆహ్లదకరమైన వాతావరణంలో ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. కొత్త నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి:
రోజూవారీ ఖర్చులకు ఆదాయం సమకూరుతుంది. ఆర్థిక సమస్యల వల్ల కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తాయి. ఉద్యోగులు పదోన్నతి విషయంలో శుభవార్తలు వింటారు. అలాగే కొన్ని పనుల ద్వారా ప్రశంసలు పొందుతారు. శత్రువల బెడద ఉన్నా.. వారిపై విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి:
ఈ రాశి వారికి శ్రావణ మాసం మొదటి సోమవారం కలిసి రానుంది. వీరు ఆకస్మిక సంపదను పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అయితే బంధువులతో విభేదాలు రావొచ్చు. కొందరు వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

మకర రాశి:
సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వివిధ మార్గాల నుంచి డబ్బు వస్తుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ ఆస్తిలో భాగస్వామ్యం అవుతారు. వ్యాపారులు అనేక కొత్త పెట్టుబడులకు ఉత్సాహం చూపుతారు.

కుంభరాశి:
ఆర్థిక సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామ్యం నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. వాదనలకు దూరంగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.

మీనరాశి:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని ఖర్చులను తగ్గించుకుంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉల్లాసంగా గడపడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper
Exit mobile version