spot_img
Homeక్రీడలుక్రికెట్‌Riyan Parag Vaping Controversy: చేసిందే పనికిమాలిన పని.. పైగా సమర్ధింపు.. ఇలాగైతే ఈ క్రికెటర్...

Riyan Parag Vaping Controversy: చేసిందే పనికిమాలిన పని.. పైగా సమర్ధింపు.. ఇలాగైతే ఈ క్రికెటర్ కెరియర్ క్లోజ్ అయినట్టే

Riyan Parag Vaping Controversy: ఒక ఆటగాడిలో ఎంత ప్రతిభ ఉన్నా సరే.. అతడు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. క్రమశిక్షణను పాటించాలి. అప్పుడే అతడు గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకుంటాడు. అలా కాకుండా.. నేనింతే.. మారను అంతే. ఏదైనా చేస్తాను అంటే కుదరదు.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో చాలామంది ఆటగాళ్లు వచ్చారు.. వెళ్లిపోయారు.. క్రమశిక్షణ కలిగి ఉన్న ప్లేయర్లు మాత్రమే బలంగా నిలబడ్డారు. సుదీర్ఘకాలం క్రికెట్ ఆడారు. అశేషమైన అభిమానుల ప్రేమను పొందారు. ఇప్పటికీ కూడా ఆరాధ్య ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఉదాహరణకు ఆస్ట్రేలియా క్రికెటర్ అండ్రు సైమండ్స్ ను తీసుకుంటే.. మంకీ గేట్ వివాదంతో అతడు తన కెరియర్ మొత్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా జట్టులో ఓ మైకేల్ బేవాన్ లాగా ఉండాల్సిన అతడు.. తన కెరియర్ ను పూర్తి కాలం కొనసాగించకుండానే రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. ఒకరకంగా ఆస్ట్రేలియా క్రికెట్ మేనేజ్మెంట్ ఒత్తిడి తీసుకురావడం వల్లే అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే.. ఇలాంటి ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. ఎంతో గొప్పగా కెరియర్ నిర్మించుకోవాల్సిన వారు.. మధ్యలోనే నిష్క్రమించారు.

ఇప్పుడు ఈ జాబితాలో రాజస్థాన్ ఐపీఎల్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా చేరిపోతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల అతడు వేపింగ్ కు పాల్పడ్డాడు. వేపింగ్ అంటే డ్రెస్సింగ్ రూమ్ లో ఈ సిగరెట్ తాగడం.. వాస్తవానికి దీనిని ఎప్పటినుంచో బీసీసీఐ నిషేధించింది. కానీ అతడు అలా తాగడం నిబంధనలకు విరుద్ధం. ఇతడి పై బీసీసీఐ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలియదు గానీ.. తను చేసిన పనిని మాత్రం అతడు సమర్ధించుకుంటున్నాడు.. తాను ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు. ఇందులో ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినప్పటికీ.. తన ధోరణి ఇలానే ఉంటుందని స్పష్టం చేశాడు. అయితే అతడు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీసీసీఐ తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.

ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో పరాగ్ 50 బంతుల్లోనే 90 పరుగులు చేశాడు. ఇటీవల కాలంలో అతడు అంతగా ఫామ్ లో లేడు. అయినప్పటికీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు టచ్ లోకి వచ్చాడు. అయినప్పటికీ అతడి జట్టు ఓడిపోయింది. తన జట్టు ఓడిపోయిన తర్వాత.. అంత గొప్ప ఇన్నింగ్స్ ఆడినా ఉపయోగం లేదని పేర్కొన్నాడు. తాను ఏ పరిస్థితుల్లో ఉన్నా జట్టును గెలిపించడమే మార్గమని అతడు వ్యాఖ్యానించాడు. తాను చేసిన పని పట్ల సమర్ధింపు ధోరణితో మాట్లాడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలానే వ్యవహరిస్తే కెరియర్ మధ్యలోనే క్లోజ్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper