https://oktelugu.com/

Mahesh Babu : ఇప్పటివరకు మహేష్ బాబు రగ్గుడ్ లుక్ లో ఎందుకు కనిపించలేదో తెలుసా..?

Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సక్సెస్ ల బాట పట్టిన విషయం మనకు తెలిసిందే. ఇక ప్రతి హీరో పాన్ ఇండియా సినిమాలను చేయడమే టార్గెట్ గా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.

Written By: , Updated On : March 28, 2025 / 09:33 AM IST
Mahesh Babu

Mahesh Babu

Follow us on

Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సక్సెస్ ల బాట పట్టిన విషయం మనకు తెలిసిందే. ఇక ప్రతి హీరో పాన్ ఇండియా సినిమాలను చేయడమే టార్గెట్ గా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరి టార్గెట్ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం… మరి ఇలాంటి క్రమంలో కొంతమంది హీరోలు మాత్రం పాన్ వరల్డ్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు…

ప్రస్తుతం చాలా మంది హీరోలు మాస్ సినిమాలను చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. స్టార్ హీరోలందరు మాస్ సినిమాల్లో నటిస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. మహేష్ బాబు మాస్ సినిమాలను చేశాడు కానీ రగ్గుడ్ లుక్కులో మాత్రం ఒక్కసారి కూడా కనిపించలేదు. కారణం ఏంటి అనే ధోరణిలో చాలామంది చాలా రకాల ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. నిజానికి మహేష్ బాబు భారీ గడ్డం పెట్టుకొని రగ్గుడ్ లుక్ లో కనిపిస్తే అంత బాగుండడు. ఆయన మిల్క్ బాయ్ లా ఉంటాడు కాబట్టి ఆయనకు రగ్గుడ్ లుక్ అయితే సెట్ అవ్వదు. పోకిరి, అతిధి సినిమాల్లో మాదిరిగా మాస్ సినిమాలైతే చేయగలడు కానీ రా అండ్ రాస్టిక్ సినిమాలను చేయడం కష్టమే… నిజానికి ఈయన సినిమాను చూసే జనాలు కూడా మహేష్ బాబుని అలాంటి క్యారెక్టర్ లో చూడలేరు. అందువల్లే అతను అలాంటి సినిమాలు చేయలేదని పలు సందర్భాల్లో మహేష్ బాబు తెలియజేశాడు. మరి మొత్తానికైతే ఇప్పుడున్న యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో కూడా పాన్ ఇండియా బాట పడుతున్న విషయం మనకు తెలిసిందే.

Also Read : పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్ మూవీ…డైరెక్టర్ ఎవరంటే..?

కానీ మహేష్ బాబు మాత్రం ఇప్పటివరకు తెలుగు సినిమాలనే చేసి ఇప్పుడు డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. మధ్యలో పాన్ ఇండియా అనేది ఒకటుందని కూడా మహేష్ బాబు మర్చిపోయాడు అంటూ కొంతమంది కామెడీ గా మాట్లాడుతున్నారు. కొడితే కుంభస్థలన్నే కొట్టాలి అనే రేంజ్ లో మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి జక్కన్న విపరీతమైన ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమా చాలా ప్రత్యేకమని రాజమౌళి ఒక సందర్భంలో తెలియజేయడం విశేషం.

మరి ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఎక్కడ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చేస్తూ వస్తున్నాడు. ఇక మొత్తానికైతే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు లాంటి స్టార్ హీరో మరొకరు ఉండరనేది వాస్తవం… మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Also Read : మహేష్ బాబు ను ఫాలో అవుతున్న స్టార్ హీరో…కారణం ఏంటంటే..?