Rishabh Pant : నాడు రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడినప్పుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రజత్ అనే యువకుడు, మరి కొంతమంది కలిసి.. రిషబ్ పంత్ ను కాపాడారు. సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ విషయాన్ని రిషబ్ పంత్ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వారు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చారు. ఆ తర్వాత సుదీర్ఘకాలం రిషబ్ పంత్ మంచానికే పరిమితమయ్యాడు. కనీసం నడిచే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కొన్ని నెలల పాటు అతడు బ్రష్ కూడా చేయలేదు. అంతటి నొప్పుల నుంచి.. గాయాల నుంచి రిషబ్ పంత్ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత అతడు నేషనల్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. కొద్దిరోజుల పాటు అక్కడ చికిత్స పొందిన తర్వాత.. గత ఏడాది ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించాడు. జట్టుకు తనదైన మార్క్ విజయాలు అందించాడు. ఇప్పుడు రిషబ్ పంత్ లక్నో జట్టు తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ లో అత్యధిక దరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. అయితే తన ప్రాణాలు కాపాడిన వారికి ఇటీవల రిషబ్ పంత్ స్కూటీ వాహనాలను బహుమతిగా అందించాడు. వారు తన ప్రాణాలను కాపాడారని.. జన్మజన్మలా రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. అంతేకాదు తనకు వచ్చే మ్యాచ్ ఫీజులో 10 శాతాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని పేర్కొన్నాడు.
ఇప్పుడు చావు బతుకుల్లో..
నాడు రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన వారిలో యూపీ యువకుడు రజత్(21) ఇప్పుడు చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. రజత్ యూపీలో ఒక కాలేజీలో చదువుతున్నాడు. అతడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. కులాలు వే రు కావడంతో అమ్మాయి తరఫున వారు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో తన ప్రేమికురాలు మన్నుతో కలిసి అతడు ఈ నెల 9న విషం తాగాడు. విషం తాగడంతో వారిద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే వారిని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మన్ను అపస్మారక స్థితికి చేరి బుధవారం సాయంత్రం వచ్చి చెందింది. ప్రస్తుతం రజత్ పరిస్థితి కూడా విషమంగా ఉంది.. అతడికి అత్యవసర వైద్య విభాగం లో చికిత్స అందిస్తున్నారు. అతడి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం అతడు చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు..” అతడు పురుగుల మందు తాగాడు. లేకపోతే అది కలుపును నివారించడానికి ఉపయోగిస్తారు. అది అత్యంత ప్రమాదకరమైనది. రజత్ కిడ్నీలు సరిగా పనిచేయడం లేదు. డయాలసిస్ చేస్తున్నాము. లివర్, గుండె పనితీరు కూడా అంతంత మాత్రం గానే ఉంది. అతని ప్రాణాలు కాపాడేందుకు మా వంతుగా ప్రయత్నాలు చేస్తున్నాం. కాకపోతే అతడి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని” వైద్యులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనపై రిషబ్ పంత్ అభిమానులు స్పందిస్తున్నారు. రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఇలా ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించడం దారుణమని వాపోతున్నారు. ప్రేమను గెలిపించుకోవడానికి ప్రయత్నించి ఉంటే బాగుండేదని.. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి.. తన ప్రాణాలు ఇలా తీసుకోవడానికి ప్రయత్నించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.