Rishabh Pant: లక్నో జట్టుకు కెప్టెన్ గా రావడంతో తనకు సంతోషంగా ఉందని రిషబ్ పంత్ ప్రకటించాడు. లక్నో జట్టును సరికొత్తగా మార్చుతానని వెల్లడించాడు. ఈసారి విజేతగా లక్నో జట్టును నిలుపుతానని వివరించాడు…. కానీ వాస్తవంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. లక్నో జట్టు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడగా.. రెండు విజయాలు.. రెండు ఓటములతో పడుతూ లేస్తూ ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రయాణం సాగిస్తోంది. ఇక శుక్రవారం రాత్రి ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో ఉత్కంఠ పరిస్థితుల మధ్య విజయం సాధించింది. హోరాహోరిగా సాగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. తద్వారా పాయింట్లు పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది..
Also Read: CSK కెప్టెన్ గా ధోని.. కారణమిదే.. ఫ్యాన్స్ కు ఇక పూనకాలే..
అతని వల్ల ఒత్తిడి పెరుగుతోందా
లక్నో జట్టు యజమాని సంజీవ్ గొయేంకా ప్రతి మ్యాచ్లో ఇన్వాల్వ్ కావడం.. జట్టు ఆటగాళ్లకు క్లాస్ పీకడం.. రిషబ్ పంత్ కు ఊపిరి సలపనివకపోవడంతో.. జట్టు ప్రయాణం ఇలా పడుతూ లేస్తూ సాగుతోందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక రిషబ్ పంత్ పై విపరీతమైన ఒత్తిడి పెంచడం వల్ల అతడు సరిగ్గా ఆడటం లేదని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.. విపరీతమైన ఒత్తిడి వల్ల రిషబ్ పంత్ ఆట మీద సరిగా దృష్టి సారించడం లేదని.. తనతైన మార్క్ షాట్లు ఆడటంలేదని.. అందువల్లే వరుసగా విఫలమవుతున్నాడని లక్నో జట్టు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో ఢిల్లీ జట్టుకు ఆడినప్పుడు రిషబ్ పంత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేవాడని.. మైదానం నలుమూలలా షాట్లు కొట్టేవాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు అతని మీద గోయేంకా విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నాడని.. ప్రతి మ్యాచ్ లోనూ గెలవాలని.. లేకపోతే తిడుతున్నాడని.. అందువల్లే రిషబ్ పంత్ ఇలాంటి విఫల ప్రదర్శన చేస్తున్నాడని లక్నో అభిమానులు వాపోతున్నారు. జట్టును జట్టు తీరుగా ఉంచాలని.. అనవసరమైన ఒత్తిడి పెంచకుండా చూడాలని.. అప్పుడే లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడతాడని.. కెప్టెన్ పదవికి న్యాయం చేస్తాడని.. తనను 27 కోట్లు పెట్టి కొనుగోలు చేసినందుకు మెరుగైన ఫలితం అందిస్తాడని.. రిషబ్ పంత్ అభిమానులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంజీవ్ గోయెంకా తన తీరు మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు. రిషబ్ పంత్ గత నాలుగు ఇన్నింగ్స్ లలో ఒకసారి డకౌట్.. రెండుసార్లు రెండు పరుగులు. . ఒకసారి 15 పరుగులు చేశాడు. అయితే కెప్టెన్ గా అతడు విజయవంతమవుతున్నప్పటికీ.. ఆటగాడిగా మాత్రం విఫలమవుతున్నాడు. ఎడమ చేతివాటం తో బ్యాటింగ్ చేసే అతడు ఊరికనే తడబాటుకు గురవుతున్నాడు. అందువల్లే అతడు గొప్ప ఇన్నింగ్స్ ఆడలేక పోతున్నాడు. ఫలితంగా రిషబ్ పంత్ పై విమర్శలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.