MS Dhoni : ధోని సారథ్యంలో చెన్నై జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచింది. గత సీజన్లో చెన్నై జట్టు సారధ్య బాధ్యతల నుంచి ధోని తప్పుకున్నాడు. వికెట్ కీపర్, కీలక ఆటగాడిగా మాత్రం కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ధోనీ వయసు 43 సంవత్సరాలు. అయినప్పటికీ అతడు మునుపటి లాగానే ఆడుతున్నాడు. అంతే ఉత్సాహంగా మైదానంలో కనిపిస్తున్నాడు.. వికెట్ల వెనుక సెకండ్ల వ్యవధిలోనే స్టంప్ అవుట్ చేస్తున్నాడు. ఇటీవల ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ను జస్ట్ సెకండ్ల వ్యవధిలోనే స్టాంప్ అవుట్ చేసి పెవిలియన్ పంపించాడు. అయితే అటువంటి ధోని ఇప్పుడు మళ్లీ చెన్నై సారధ్య బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది. జాతీయ మీడియాలో దీనికి సంబంధించి అనేక కథనాలు ప్రసారమవుతున్నాయి. దీంతో చెన్నై అభిమానులు ఎగిరి గంతులు వేస్తున్నారు.
Also Read : జట్టులోకి భీకర బౌలర్.. MI కి శుభవార్త..
అందువల్లే ధోనీకి నాయకత్వ బాధ్యతలు
రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చేతికి గాయమైంది. చెన్నై జట్టు తన తదుపరి మ్యాచ్ ఢిల్లీ జట్టుతో ఆడుతుంది. గాయం నుంచి రుతురాజ్ గైక్వాడ్ ఇంతవరకు కోలుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ అతడు గనుక కోలుకోకపోతే.. అతని స్థానంలో చెన్నై జట్టుకు ధోని సారధ్య బాధ్యతలు స్వీకరిస్తాడని తెలుస్తోంది. “ధోనిని కెప్టెన్ గా నియమించే అవకాశాలు ఉన్నాయి.. ఎందుకంటే రుతురాజ్ ఢిల్లీ జట్టుతో జరిగే మ్యాచ్ లో ఆడేది అనుమానమే. అందువల్లే అతని స్థానాన్ని భర్తీ చేయడానికి మేము ధోనిని ప్రధానంగా భావించాం.. కాకపోతే ఈ విషయాన్ని ఇంతవరకు ధోనితో చెప్పలేదు. బహుశా మేనేజ్మెంట్ అభ్యర్థనను ధోని కాదనకపోవచ్చు.. ధోని సారథ్యంలో చెన్నై జట్టు అద్భుతమైన విజయాలు సాధించింది. ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. అతడి నాయకత్వంలో చెన్నై జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుందని.. స్పష్టమైన ఆధిక్యాన్ని చూపుతుందని.. ఈ విషయాలను నేను బలంగా నమ్ముతున్నానని” చెన్నై జట్టులో కీలకంగా కొనసాగుతున్న మైకేల్ హస్సీ వ్యాఖ్యానించాడు. హస్సీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి. అంతేకాదు చెన్నై అభిమానుల్లో హర్షాన్ని నింపుతున్నాయి. మామూలుగానే బ్యాటింగ్ కు వస్తే సోషల్ మీడియా మొత్తం ధోని నామస్మరణ చేస్తుంది. అలాంటిది కెప్టెన్ గా ఉంటే ఇక సోషల్ మీడియా మొత్తం ధోని పేరునే కలవరిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇటీవల జరిగిన మ్యాచ్లలో ధోని బ్యాటింగ్ కు వచ్చినప్పుడు చెన్నై అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు.. మైదానాలలో ధోని ధోని అంటూ నినాదాలు చేసి.. పెను ప్రకంపనలు సృష్టించారు.
Also Read : గాయమా తీసేసారా.. రోహిత్ శర్మ ముంబై ప్లేయింగ్ 11 లో ఎందుకు లేడు?