Alekhya Chitti Pickles: ఇటీవల సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి.. సంచలనంగా మారింది. వాస్తవానికి ఈ కాలపు యువతి. పికిల్స్ వ్యాపారంలోకి వచ్చేసింది . రాజమండ్రి కేంద్రంగా వ్యాపారాన్ని మొదలుపెట్టింది. తోడుగా తన సోదరీమణులను కూడా పెట్టుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అలేఖ్య చిట్టి పికిల్స్ కు విపరీతమైన ధర ఉంది. దానిని ప్రశ్నించిన ఓ వినియోగదారులపై అలేఖ్య చిట్టి బూతుల దండకం మొదలుపెట్టింది. ఆ బూతులు కూడా దారుణంగా ఉన్నాయి. వినడానికి.. రాయడానికి ఇబ్బందికరంగా ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పై నెటిజన్లు యుద్ధం మొదలుపెట్టారు. అంతేకాదు ఆమె వద్ద పికిల్స్ కొనకూడదని తీర్మానం చేశారు. దీంతో ఈ సోషల్ మీడియా యుద్ధం అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఈ పరిణామంతో అలేఖ్య చిట్టి తన పికిల్స్ వ్యాపారాన్ని మూసుకోవాల్సి వచ్చింది. వెబ్సైట్ క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. వాట్సప్ ఎకౌంటు డిలీట్ చేయాల్సి వచ్చింది.
Also Read: అలేఖ్య చిట్టిని హీరో ప్రియదర్శి మామూలుగా ఆడుకోలేదు.. వీడియో వైరల్
ఇప్పుడు జ్ఞానోదయం అయింది
వినియోగదారులు దేవుళ్ళతో సమానమని.. వారి చలవ వల్లే ఇంతటి స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందామని సోయిని మర్చిపోయి అలేఖ్య చిట్టి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడింది. అయితే ఇప్పుడు వ్యాపారం క్లోజ్ కావడంతో ఒక్కసారిగా లైన్ లోకి వచ్చింది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో దూరంగా ఉంటున్న అలేఖ్య చిట్టి ఇప్పుడు పాతకాలం సినిమాలో సావిత్రి లాగా కన్నీరు మొదలు పెట్టింది. ఇప్పటివరకు ఎంతమంది కస్టమర్లను తిట్టాను తెలియదు . వారందరికీ క్షమాపణలు చెబుతున్నా. వారిని తిట్టినందుకు లెంపలు వేసుకుంటున్నా.. అంటూ అలేఖ్య చిట్టి సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. ” నేను పికిల్స్ వ్యాపారం మొదలు పెట్టినప్పుడు చాలామంది కస్టమర్లు నాకు అండగా నిలిచారు. ఒక కస్టమర్ మాత్రం ధర ఎక్కువగా ఉందని మెసేజ్ చేయడంతో అనవసరంగా మా ఇంట్లో ఒకరు కోప్పడ్డారు. పరిధి దాటి మాటలు మాట్లాడారు. అతడు మాత్రమే కాదు.. చాలామంది మా ప్రవర్తన వల్ల నొచ్చుకున్నారని తెలిసింది. మా వల్ల అలా ఇబ్బంది పడిన వారందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాం. మేము అలా చేయడం తప్పే. ఏది ఏమైనప్పటికీ మమ్మల్ని పెద్దమనిషితో క్షమిస్తారని కోరుకుంటున్నానని” అలేఖ్య చిట్టి సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వీడియోలో పేర్కొంది. అయితే ఇప్పటికే నష్టం జరిగిపోయిందని.. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదని.. నెటిజన్లు అంటున్నారు. క్షమాపణలు అయితే చెప్పారు గాని.. కస్టమర్ల నుంచి అధికంగా వసూలు చేసిన డబ్బు మాటేమిటి అని.. వాటిని కూడా ఆ కస్టమర్లకు తిరిగి చెల్లిస్తారు అంటూ నెటిజన్లు అలేఖ్య చిట్టిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మీ ధోరణి మార్చుకోవాలని.. లేనిపక్షంలో జనాలు తిరగబడతారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
నేను తప్పు చేశాను.. ఇప్పటివరకు ఎంత మందిని తిట్టానో వారందరికీ క్షమాపణలు అడుగుతున్నా – అలేఖ్య చిట్టి (పికిల్స్) pic.twitter.com/5p5v0ubQAD
— Telugu Scribe (@TeluguScribe) April 5, 2025