Rishabh pant : గత సీజన్లో ఢిల్లీ జట్టు సారధిగా రిషబ్ పంత్ పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత జాతీయ జట్టులోకి వచ్చాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేస్తున్నాడు. ఇక ఇదే సమయంలో లక్నో జట్టు నుంచి కేఎల్ రాహుల్ తప్పుకున్నాడు. అతని స్థానంలో ఎవరిని నియమించాలని లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంక ఆలోచిస్తుండగా మదిలో ఒకసారిగా పంత్ మెదిలాడు. దీంతో మరో మాటకు తావు లేకుండా సంజీవ్ రిషబ్ పంత్ ను ఎంచుకున్నాడు. అతడైతేనే తన జట్టుకు న్యాయం చేస్తాడని భావించాడు. ఇందులో భాగంగానే అతని భారీ ధరకు దక్కించుకున్నాడు. 27 కోట్లను రిషబ్ పంత్ మీద కుమ్మరించాడు. ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు.
Also Read : పూర్ రిషబ్..27 కోట్లు పెట్టి కొంటే 128 పరుగులు.. ఎంత నామర్ద!
అక్కడే దెబ్బ కొట్టింది
గత సీజన్లో కేఎల్ రాహుల్ ను ఏ కారణంతో అయితే జట్టుకు సంజీవ్ దూరం చేశాడో.. ఇప్పుడు రిషబ్ పంత్ కూడా అదే కారణం మాదిరిగా ఆడుతున్నాడు.. ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి తనది అని చెప్పుకునే ఇన్నింగ్స్ ఆడలేక పోయాడు. ఇక ఇటీవలి పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ అత్యంత దారుణంగా అవుట్ అయ్యాడు. వాస్తవానికి ఇలాంటి పరిస్థితుల్లో ఏ జట్టు నాయకుడైనా ఇంత దారుణంగా అవుట్ అయితే మేనేజ్మెంట్ చూస్తూ ఎలా ఊరుకుంటుంది.. ఇప్పుడు లక్నో యజమాని కూడా అదే పని చేస్తున్నాడు. లక్నో జుట్టు కెప్టెన్ గా రిషబ్ పంత్ ను మార్చాలని భావిస్తున్నాడు. అతని స్థానంలో ఆయుష్ బదోనికి జట్టు పగ్గాలు అప్పగించాలని యోచిస్తున్నాడు. ఇక ఈ సీజన్లో ఆయుష్ 11 మ్యాచ్లలో 326 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ ఇప్పటివరకు 10 మ్యాచ్లు వాడి 128 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 12.08 అంటే బ్యాటింగ్ ఎంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ బదోనిని కనుక కెప్టెన్ చేస్తే.. రిషబ్ పంత్ కెరియర్ ముగిసినట్టేనని.. అతడి కెరియర్ కు ప్రమాద ఘంటికలు మోగినట్టేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ఒత్తిడి పెరిగిందా
లక్నో జుట్టు ఓడిపోయిన తర్వాత.. ఆ జట్టు యజమాని సంజీవ్ ప్లేయర్లతో మీట్ అయ్యేవారు. ఓటమికి సంబంధించిన కారణాలు తెలుసుకునేవారు. ఒక యజమానిగా ఇది ఆయన హక్కు కూడా. కానీ అదే పనిగా ఆటగాళ్లకు క్లాస్ పీకే వారిని తెలుస్తోంది. అందువల్లే రిషబ్ పంత్ తెలియని ఒత్తిడికి గురవుతున్నాడని.. అందుకే ఇలా విఫలమవుతున్నాడని తెలుస్తోంది.. దూకుడుగా బ్యాటింగ్ చేస్తే రిషబ్ పంత్ ఇలా విఫలం కావడానికి లక్నో జట్టు ఆటగాళ్లు మాత్రమే కాదు అతని అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. త్వరగా ఫామ్ లోకి రావాలని కోరుతున్నారు.
Also Read : ఓపెనర్ గా వచ్చినా సేమ్ అదే కథ.. పంత్ గ్రహచారం బాగోలేదా?