operation sindoor : పహల్గాం దాడి తర్వాత భారత్ ప్రతీకార చర్యకు పూనుకుంటుంది. ఈ దాడిలో అమాయకమైన భారత పౌరులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను అంతం చేసేలా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే భారత్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న భారత్కు ఈ అర్ధరాత్రి యుద్ధం ప్రారంభించింది. విఆపరేషన్ సింధూర్’ పేరుతో ప్రారంభించిన ఈ యుద్ధం లో భాగంగా ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. దీంతో చాలామంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. అయితే కవ్వింపు చర్యల్లో భాగంగా పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతుంది. కానీ భారత్ మాత్రం ఉగ్రవాదులే లక్ష్యంగా చేసుకొని ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతం చేస్తామని చెబుతోంది. అసలు ఈ యుద్ధానికి ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారు? సింధూర్ అంటే ఏమిటి?
Laser show in Pakistan- Sponsored by our Indian Army
Total of 9 events happened at the same time
Jai Hind!!❤️#PahalgamTerrorAttack
#OperationSindoor pic.twitter.com/ROwW2Ubsmr— Legend Prabhas (@CanadaPrabhasFN) May 6, 2025
జమ్ము కాశ్మీర్లోని పహాల్గంలో ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రవాదులు ఆకస్మికంగా ఈ ప్రాంతానికి వచ్చి భారత పౌరులను నిర్దాక్షిణ్యంగా కాల్చివేశారు. అయితే ఇందులో మహిళలు విడిచిపెట్టి వారి భర్తలను కళ్లెదుటే కాల్చివేయడం కాల్చివేసింది. అంతేకాకుండా హిందువులు ఎవరు అని అడిగి మరీ చెప్పడం భారత్ ను దెబ్బ కొట్టడమే లక్ష్యమని అంటున్నారు. ఈ దాడి కేవలం కొందరిపై మాత్రమే కాదని యావత్ దేశంపై అని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. దీనికి ప్రతీకారంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా అవసరమైతే యుద్ధం కూడా చేయాల్సి వస్తుందని ఇదివరకే చెప్పారు.
అయితే తాజాగా ప్రారంభించిన యుద్ధానికి ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టారు. సింధూర్ అంటే కేవలం నామమాత్రమైన పేరు మాత్రమే కాదని, మహిళలు భర్తలకు ప్రతిరూపంగా నుదుటన కుంకుమను ధరిస్తారు. కానీ పహల్గాం లో మహిళలను విడిచిపెట్టి వారి భర్తలను చంపి వారి నుదుటన ఉన్న కుంకుమను చెరిపివేశారు. ఈ కుంకుమ మరోసారి చెరిగిపోకుండా ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యమని… అందుకే ఈ ఆపరేషన్కు.. ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టినట్లు చెబుతున్నారు. ఉగ్రవాదులను అంత చేసి మహిళల గౌరవాన్ని నిలబెడతామని ఈ సందర్భంగా ఈ ఆపరేషన్కు ఈ పేరు పెట్టినట్లు చెబుతున్నారు.
అయితే భారత్, పాకిస్తాన్ మధ్య ప్రధానంగా ఉన్న నది సింధూ నది. ఈ నది నీళ్లను ఆపివేయడంతో అసలైన యుద్ధం మొదలైందని.. అందుకే దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినట్లు మరి కొందరు అంటున్నారు. కానీ ముఖ్యంగా మహిళల కోసమే ఈ పేరును నిర్ణయించినట్లు మరి కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ‘ఆపరేషన్ సింధూర్’పేరుతో ప్రారంభమైన ఈ యుద్ధంలో భారత్ పై చేయి సాధిస్తుందని నమ్మ పలుకుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఉగ్రవాదులపై మిస్సైల్స్ దాడి చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. ఉగ్రవాదుల జాడ తెలుసుకున్న ఆర్మీ ఆ శిబిరాలను కుప్ప కూల్చేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే ఈ సమయంలో పాక్ చేస్తున్న కాల్పులను కూడా తిట్టుకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతం కావాలని యావత్ భారతదేశం కోరుకుంటుంది.