https://oktelugu.com/

IPL Mega Auction 2025: మీ పంట పండిందయ్యా పంత్, అయ్యరూ..27 కోట్లతో స్టార్క్ రికార్డులు బద్దలు.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం

గత సీజన్లో కోల్ కతా జట్టును శ్రేయస్ అయ్యర్ విజేతగా నిలిపాడు. ప్రారంభం నుంచి చివరి వరకు జట్టును ఏకతాటిపై నిలిపాడు. ఏమాత్రం తలవంచకుండా.. ఎక్కడ కూడా తొణకకుండా నడిపాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 24, 2024 / 04:51 PM IST

    IPL Mega Auction 2025(1)

    Follow us on

    IPL Mega Auction 2025: ఐపీఎల్ వేలం జోరుగా కొనసాగుతోంది. స్టార్ ఆటగాళ్లకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో జట్ల యాజమాన్యాలు కోట్లను కోట్ల కుమ్మరిస్తున్నాయి.. అయితే ఈసారి ఇండియన్ ఆటగాళ్లు అత్యధిక ధర పలికి ఆశ్చర్యపరిచారు. అంతేకాదు గత సీజన్లో హైయెస్ట్ ప్రైస్ దక్కించుకున్న ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ ను రికార్డులను బద్దలు కొట్టారు.

    గత సీజన్లో కోల్ కతా జట్టును శ్రేయస్ అయ్యర్ విజేతగా నిలిపాడు. ప్రారంభం నుంచి చివరి వరకు జట్టును ఏకతాటిపై నిలిపాడు. ఏమాత్రం తలవంచకుండా.. ఎక్కడ కూడా తొణకకుండా నడిపాడు. అందువల్లే కోల్ కతా జట్టు అంచనాలకు మించి రాణించింది.. మేటిమేటి జట్లను మట్టికరిపించి విజేతగా నిలిపింది. దీంతో పది సంవత్సరాలు నిరీక్షణకు అయ్యర్ ముగింపు పలకడంతో.. ఆ జట్టులో విజయ గర్వం తొణకిసలాడింది.. అయితే కోల్ కతా జట్టు యాజమాన్యం అయ్యర్ ను ఈసారి రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసింది. దీంతో ఆ నిర్ణయం ఒక్కసారిగా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అతడికి పోటీ ఉంటుందని అందరు భావించారు. అన్ని జట్ల యాజమాన్యాలు అతడిని కొనుగోలు చేయడానికి పోటీ పడతాయని ఊహించారు. ఊహించినట్టుగానే అతడు ఎక్కువ ధర పలికాడు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలోనే రెండవ అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గత ఏడాది స్టార్క్ ను 24.75 కోట్లకు కోల్ కతా దక్కించుకుంది. అప్పట్లోనే అది హైయెస్ట్ రికార్డ్.. ఒక విదేశీ ఆటగాడికి ఆ ధర చెల్లించడం సంచలనంగా మారింది. ఇంతవరకు ఏ ఆటగాడు కూడా ఆ స్థాయిలో దక్కించుకోలేదు. అయితే ఇప్పుడు స్టార్క్ రికార్డును కూడా అయ్యర్ బద్దలు కొట్టాడు. పంజాబ్ జట్టు అతడి కోసం ఏకంగా 26.75 కోట్లు చెల్లించడం విశేషం.

    బేస్ ప్రైస్ రెండు కోట్లు

    అయ్యర్ బెస్ట్ ప్రైస్ రెండు కోట్లు ఉండగా.. పంజాబ్ జట్టు 26.75 కోట్లకు దక్కించుకుంది. అయ్యర్ కోసం ఢిల్లీ, పంజాబ్ జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. ఒకానొక దశలో పంజాబ్ జట్టు అంచనాలకు మించిన ఫిగర్ కోట్ చేయడంతో ఢిల్లీ జట్టు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీంతో పంజాబ్ జట్టు ఏకంగా 26.75 కోట్లు కోట్ చేసి అయ్యర్ ను దక్కించుకుంది. తద్వారా అయ్యర్ ఐపిఎల్ చరిత్రలోనే ఎక్కువ ధర కు అమ్ముడుపోయిన రెండవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ పేరు మీద ఉండేది. అయితే అతడి కంటే దాదాపు రెండు కోట్లు ఎక్కువకు అయ్యర్ అమ్ముడుపోయి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గత కొంతకాలంగా స్థిరమైన క్రికెట్ ఆడుతున్న అయ్యర్.. తమ జట్టును విజయపథంలో నడిపిస్తాడని భావించి పంజాబ్ జట్టు ఆ స్థాయిలో ధర చెల్లించిందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

    రిషబ్ పంత్ 27 కోట్లు

    ఢిల్లీ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ అందరూ అనుకున్నట్టుగానే ఐపీఎల్ వేలంలో అదరగొట్టాడు. అతని కోసం లక్నో జట్టు ఏకంగా 27 కోట్లు చెల్లించింది. రైట్ టు మ్యాచ్ విధానంలో ఢిల్లీ జట్టు పంత్ ను దక్కించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ లక్నో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ ప్రైస్ దక్కించుకున్న ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు. 27 కోట్లతో సరికొత్త రికార్డును సృష్టించాడు. అయితే అయ్యర్ ను పంజాబ్ జట్టు 26.75 కోట్లకు కొనుగోలు చేయగా.. 25 లక్షలు అదనంగా చెల్లించి 27 కోట్లకు పంత్ ను లక్నో జట్టు కొనుగోలు చేసింది.