https://oktelugu.com/

CSK Pant : చెన్నై జట్టులోకి రిషబ్ పంత్.. కెప్టెన్సీ కూడా అతడికే.. వేలానికి ముందు ఇదేం ట్విస్ట్ రా బాబూ.. ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి..

ఐపీఎల్ లో చెన్నై జట్టుకు, ధోనికి విడదీయరాని అనుబంధం ఉంది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందినప్పటికీ.. ధోనిని చెన్నై అభిమానులు ఓన్ చేసుకున్నారు. ఏకంగా తల అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో ధోని కూడా ఆ జట్టుతోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : October 27, 2024 1:14 pm
    Follow us on

    CSK Pant : ఐపీఎల్ 18 సీజన్ కు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రిటెన్షన్ జాబితాకు అడుగులు పడుతున్నాయి. ఇంకో ఐదు రోజుల్లో అన్ని జట్లు తాము ఉంచుకోవాలని భావిస్తున్న ఆటగాళ్ల పేర్లను బీసీసీఐకి చెప్పాల్సి ఉంటుంది. దీంతో ఆ ఆటగాళ్ల ఎంపికపై యాజమాన్యాలు కసరత్తును ముగించాయి. ఈ క్రమంలో చెన్నై జట్టు మహేంద్రసింగ్ ధోనీని అనామక ఆటగాడిగా ( అన్ క్యాప్డ్ ప్లేయర్) ఆడిస్తుందా? లేదా? అనే అనుమానం ఆ జట్టు అభిమానుల్లో నెలకొంది. దీనిపై చెన్నై జట్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథన్ తొలిసారిగా నోరు విప్పారు.” మాకు ఇంకా ధోని ఏమి చెప్పలేదని” పేర్కొన్నారు. అయితే న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైమన్ డౌల్ ఇదే సమయంలో ధోని తర్వాత చెన్నై జట్టును నడిపించే ఆటగాడు ఎవరు? అనే ప్రశ్నకు సంచలనమైన సమాధానం చెప్పారు. న్యూజిలాండ్ – భారత జట్ల మధ్య పూణేలో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ కు డౌల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా చెన్నై జట్టు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల పేర్లను ప్రకటించాడు. ధోని తర్వాత చెన్నై జట్టును నడిపించే ఆటగాడు ఎవరో కూడా చెప్పేశాడు..”చెన్నై జట్టు బయటికి ఎటువంటి వివరాలు చెప్పకపోయినప్పటికీ.. ప్రస్తుత కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా మతీశ పతీరణ వంటి వారు జట్టులో ఉంటారు. ధోని కూడా తన విషయంలో అక్టోబర్ 31 నాటికి ఏదో ఒక విషయం చెప్పేస్తాడు. ఇక ధోని తర్వాత చెన్నై జట్టును ఆ స్థాయిలో నడిపించాలంటే.. ఆ సామర్థ్యం రిషబ్ పంత్ కే ఉంది. ఒకవేళ పంత్ వేలంలోకి వస్తే.. చెన్నై జట్టు అతనికోసం ఎన్ని కోట్లయినా ఖర్చుపెడుతుంది.. కొనుగోలు చేస్తుందని” డౌల్ వ్యాఖ్యానించాడు.

    ఈనెల 31 లోపు..

    కాగా, ఈనెల 31 లోపు 10 జట్లు తమ రిటెన్షన్ జాబితాను బీసీసీఐకి అందిస్తాయి. ఆ తర్వాత వేళల్లోకి వచ్చే ఆటగాళ్లు.. తమ మినిమం ప్రైస్ ను రిజిస్టర్ చేయించుకుంటారు. నవంబర్ 25, 26 తేదీల్లో మెగా వేలం జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. సౌదీ అరేబియా లోని రియాద్ లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వేలం జరిగే అవకాశం ఉంది. అయితే ఈ విషయాలను బీసీసీఐ బయటికి చెప్పకపోయినప్పటికీ.. ఈసారి వేలాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.. ఈసారి నిబంధనలు కూడా మార్చిన నేపథ్యంలో.. అన్ని జట్లకు కొత్త ఆటగాళ్లు వస్తారని.. 2025 లో జరిగే ఐపీఎల్ అత్యంత రసవత్తరంగా జరుగుతుందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.