https://oktelugu.com/

US Presidential Elections: ఊరిస్తున్న అధ్యక్ష పదవి.. అగ్రరాజ్యాధిపతి రేసులో నున్వా నేనా అన్నట్లు పోటీ!

అమెరికా అధ్యక్ష ఎన్నికల కురుక్షేత్రానికి ఇంకా పది రోజులే గడువు ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయి. అధికార డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను అధ్యక్ష పదవి ఊరిస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 27, 2024 / 01:23 PM IST

    US Presidential Elections(2)

    Follow us on

    US Presidential Elections: అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. అధికార డెమొక్రటిక్‌ పార్టీ, విపక్ష రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. ఎవరికివారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇక ఓటర్ల నాడి కూడా ఈసారి అంతుచిక్కడం లేదు. సర్వేలో ఇద్దరి మధ్య స్వల్ప తేడాతో ఎవరిని అధ్యక్ష పీటం వరిస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు మొత్తం 50 రాష్ట్రాల్లో జరుగనున్నాయి. వీటిలో ఏడు రాష్ట్రాలు విజేతలను తేల్చనున్నాయి. మెజారిటీ రాష్ట్రా్టలను నెగ్గినవారే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే ఈసారి ఈ ఏడు రాష్ట్రాల్లో ఇద్దరు అభ్యర్థులు సమ ఉజ్జీలుగా ఉన్నారు. దీంతో గెలుపు ఎవరిదో అంతు చిక్కడం లేదు.

    స్వింగ్‌ స్టేట్స్‌ అంటే…?
    అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్నికల్లో అమెరికన్లున ఏదో ఒక పార్టీవైపు మొగ్గు చూపుతారు. వాటిని సేఫ్టీ స్టేట్స్‌గా పిలుస్తారు. ఇక జెండా రంగు పరంగా బ్లూ(డెమొక్రటిక్‌), రెండ్‌ (రిపబ్లిక్‌) స్టేట్‌సగా పేర్కొంటారు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఒక ఎన్నికల్లో డెమొక్రాట్లకు జై కొడితే.. మరో ఎన్నికల్లో రిపబ్లికన్లకు గెలిపిస్తున్నారు. ఇలాంటి రాష్ట్రాలనే స్వింగ్‌ స్టేట్స్, బ్యాటిల్‌ గ్రౌండ్‌ స్టేట్స్, పర్సువల్‌ స్టేట్స్‌గా పిలుస్తారు. ఇలాంటి రాష్ట్రాలు అమెరికాలో ఏడు ఉన్నాయి. అభ్యర్థులు సేఫ్‌ స్టేట్‌సపై పెద్దగా దృష్టిపెట్టరు. స్వింగ్‌ స్టేట్స్‌ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తారు. దీంతో ఈ రాష్ట్రాల్లో పోటీ హోరాహోరీగా ఉంటుంది. ఇక స్వింగ్‌ స్టేట్స్‌ జాబితాలో పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, జార్జియా, ఆరిపోనా, మిషిగన్, నెవడా, విస్కాన్‌సిన్‌ ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో పోటీ ఇలా ఉంది…

    మిషిగన్‌

    ఈ రాష్ట్రంలో ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు 15
    రాష్ట్ర జనాభా కోటి.
    2020లో ఇక్కడ బైడెన్‌ 1.5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ రాష్ట్రంలో అరబ్‌ అమెరికన్లు ఎక్కువ. వీరు ఈసారి కమలా హారిస్‌పై క కోపంగా ఉన్నారు. పశ్చిమాసియా యుద్ధంలో ఆమె ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడమే ఇందుకు కారణం. అయినా తాజా పరిస్థితి చూస్తే ఇక్కడ కమలా హారిస్‌ ట్రంప్‌ కన్నా.. 0.8 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    జార్జియా
    ఈ రాష్ట్రంలో ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు 16, ఇక్కడి జనాభా 1.1 కోట్లు. 2020లో ఇక్కడ కూడా బైడెన్‌ 13 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. గత ఎన్నికల్లో వివాదాస్పదంగా నిలిచిన రాష్ట్రం కూడా ఇదే. ఇక్కడ ఓటమిని ఒప్పుకునేందుకు ట్రంప్‌ అంగీకరించలేదు. ఏకంగా ఫలితాలనే మార్చేందుకు ప్రయత్నించి భంగపడ్డారు. నాలుగు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ రాష్ట్ర జనాభాలో మూడోవంతు ఆఫ్రికా అమెరికన్లు ఉన్నారు. ఈసారి వీరు ట్రంప్‌వైపు మొగ్గు చూపుతున్నారు. తాజా పరిస్థితి చూస్తే ట్రంప్‌.. కమలా హారిస్‌ కన్నా 2 శాతం ఓట్లు అధిక్యంలో ఉన్నారు.

    పెన్సిల్వేనియా..
    ఈ రాష్ట్రంలో ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు 19. రాష్ట్ర జనాభా 1.3 కోట్లు. 2020లో ఈ రాష్ట్రంలో కూడా బైడెన్‌ 82 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. అత్యధిక ఎలక్టోర్‌ కాలేజీ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రం అధ్యక్ష ఎన్నికల్లో కీలకం. ఇది బైడెన్‌ సొంత రాష్ట్రం. ఈసారి ఆర్థిక పరిస్థితులు ఇక్కడ కీలకంగా మారాయి. జీవన వ్యయం ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇదే ఈసారి కమలా హారిస్‌కు ప్రతీకూలంగా మారే అవకాశం ఉంది. తాజా పరిస్థితి చూస్తే కమలా హారిస్‌ 0.9 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    నార్త్‌ కరోలినా
    గత ఎన్నికల్లో ట్రంప్‌ గెలిచిన ఏకైక రాష్ట్రం ఇదే. ట్రంప్‌ ఈ రాష్ట్రంలో 74 వేల మెజారిటీ సాధించారు. ఈ రాష్ట్రంలో 10.8 కోట్ల జనాభా ఉంది. ఇక్కడ ఎలక్టోరల్‌ ఓట్లు 16. ఈసారి కూడా ఇక్కడ బైడెన్‌కు అనుకూల పరిస్థితులే ఉన్నాయి. కానీ ఆయన తప్పుకున్నాక పరిస్థితి మారింది ట్రంప్‌కు పరిస్థితులు అనుకూలంగా మారాయి. తాజా పరిస్థితి ప్రకారం.. ఈసారి కూడా ట్రంప్‌ 0.9 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    అరిజోనా
    2020లో డెమొక్రాట్ల విజయంలో ఈ రాష్ట్రం కీలకపాత్ర పనోషించింది. ఈ రాష్ట్రంలో ఎలక్టోరల్‌ ఓట్లు 11 ఉన్నాయి. రాష్ట్ర జనాభా 74 లక్షలు. ఇక్కడ బైడెన్‌ గత ఎన్నికల్లో 10 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. 1990 తర్వాత ఇక్కడ డెమొక్రటిక్‌ అభ్యర్థి గెలవడం అదే తొలిసారి. ఈ రాష్ట్రంలో మెక్సికల్‌ వలసవాదులు ఎక్కువ. ఆ దేశంతో సరిహద్దు పంచుకుంటుంది. ఈసారి ట్రంప్‌ వలసవాదులను వెనక్కు పంపుతానని హామీ ఇస్తున్నారు. ఇది అరిజోనా ఓటర్లను ఆకట్టుకుంటోంది. దీంతో తాజా పరిస్థితి చూస్తే ఇక్కడ ట్రంప్‌ ఏకంగా 3 శాతం ఓట్ల ఆధిక్యం కనబరుస్తున్నారు.

    విస్కాన్‌సిన్‌..
    స్వతంత్ర అభ్యర్థిగా తొలుత మాజీ అధ్యక్షక్షుడు జాన్‌ ఎఫ్‌.కెనడీ మేనల్లుడు రాబర్ట్‌ ఎ ఫ్‌.కెనడీ విస్కాన్‌సిన్‌లో జానాదరణ పొందాడు. ఆగస్టు చివర నాటికి ఆయన బరి నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇక్కడి ప్రజలు ట్రంప్‌కు మద్దతు పలుకుతున్నారు. గ్రీన్‌ పార్టీ అబ్యర్థి జిల్‌ స్టెయిన్‌ ఇక్కడ డెమొక్రాట్ల అవకాశాలకు గండి కొట్టారు. ఆయనను పోటీ నుంచి తప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజా పరిస్థితి ప్రకారం… ఇక్కడ హారిస్‌ ఒక శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

    నెవడా
    ఈ రాష్ట్రంలో 6 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు ఉన్నాయి. జనాభా 32 లక్షలు. 2020లో బైడెన్‌ 34 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. కొన్ని ఎన్నికల వరకూ ఈ రాష్ట్ర ప్రజలు డెమొక్రటిక్‌ పార్టీకి జై కొడుతున్నారు. అయితే ఈసారి రిపబ్లిక్‌ పార్టీకి ఆదరణ పెరిగింది. నిరుద్యోగం ఇక్కడ ప్రధాన సమస్య. తాజా పరిస్థితి చూస్తే ట్రంప్‌ కమలా హారిస్‌కన్నా ఆధిక్యంలో ఉన్నారు.