https://oktelugu.com/

Ricky Ponting : ఆ దరిద్రమైన ఫ్రాంచైజీ కి కోచ్ గా పాంటింగ్.. ఈసారైనా ఆ జట్టు గాడిలో పడుతుందా?

ఐపీఎల్ మెగా వేలం మరికొద్ది రోజుల్లో జరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే సీజన్ కు బలమైన జట్లను నిర్మించుకోవాలని అన్ని యాజమాన్యాలు భావిస్తున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 19, 2024 / 12:21 PM IST

    Ricky Ponting

    Follow us on

    Ricky Ponting : ఐపీఎల్ వేలానికి ముందే ఆయా జట్లు రీటైన్డ్ ఆటగాళ్ల జాబితాను రూపొందించాయి. వేలంలో దక్కించుకోవలసిన ఆటగాళ్ల లిస్ట్ ను ప్రిపేర్ చేశాయి. శిక్షణ సిబ్బందిని మార్చేస్తున్నాయి. వచ్చే సీజన్లో ఎలాగైనా సత్తా చాటాలని రాజస్థాన్ జట్టు భావిస్తోంది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ను జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పగించింది. ఢిల్లీ జట్టు రికీ పాంటింగ్ ను వదులుకుంది. మరో దిగ్గజ ఆటగాడిని కోచ్ గా నియమించుకోవాలని అనుకుంటున్నది. ఢిల్లీ జట్టుకు, పంజాబ్ జట్టుకు ఐపీఎల్ కప్ ఇంతవరకు దక్కలేదు. అందువల్లే పంజాబ్ జట్టు ఈసారి పాంటింగ్ ను కోచ్ గా నియమించుకుంది. అతడి ఆధ్వర్యంలో ఈసారైనా కప్ దక్కించుకోవాలనే అంచనాల్లో ఉంది. ఇప్పటికే పాంటింగ్ తో దఫాలుగా చర్చలు జరిపింది. పాంటింగ్ కూడా పంజాబ్ జట్టుకు పని చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ జట్టుకు పాంటింగ్ ఏడు సంవత్సరాలుగా కోచ్ గా పనిచేశాడు. పాంటింగ్ కోచ్ గా ఉన్నప్పుడు ఢిల్లీ జట్టు 2019, 2020, 2021 సీజన్లలో ప్లే ఆఫ్ కు చేరుకుంది. 2020లో ఏకంగా ఫైనల్ దాకా వెళ్ళింది. అప్పుడు రన్న రప్ గా నిలిచింది ..

    పంజాబ్ జట్టు కోచ్ గా ప్రస్తుతం ట్రెవర్ బేలిస్ కొనసాగుతున్నాడు. అతడుని తప్పించాలని పంజాబ్ జట్టు యాజమాన్యం భావిస్తోంది. మొదట్లో అతడి స్థానంలో భారతీయ ఆటగాడికి కోచ్ బాధ్యతలు అప్పగించాలని భావించింది. ఒకానొక దశలో సంజయ్ బంగర్ కోచ్ గా వస్తాడనే వ్యాఖ్యలు వినిపించాయి. తర్వాత ఏం జరిగిందో తెలియదు గాని ఇప్పుడు పాంటింగ్ పేరు వినిపిస్తోంది. బేలిస్ ఆధ్వర్యంలో పంజాబ్ జట్టు దారుణమైన ఆట తీరు కొనసాగించింది. 2023లో పంజాబ్ ఎనిమిది, 2024లో 9వ స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ జట్టు దారుణమైన రికార్డును సొంతం చేసుకుంది. 17 సీజన్లలో కేవలం రెండుసార్లు మాత్రమే ప్లే ఆఫ్ చేరింది. గత పది సీజన్లలో గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తుంది. 2014లో రన్నరప్ గా నిలవడమే పంజాబ్ జట్టు ఇప్పటివరకు చేసిన అత్యుత్తమ ప్రదర్శన. గత మూడు సీజన్లో పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. గత ఏడాది పంజాబ్ జట్టు కెప్టెన్ ధావన్ దూరం కావడం ఆట తీరుపై ప్రభావం చూపించింది. మరి ఇంతటి దారుణమైన జట్టును పాంటింగ్ ఎలా దారికి తీసుకొస్తాడో చూడాల్సి ఉంది.