Israel – Hezbollah : ఇజ్రాయెల్‌కు చిక్కకుండా.. హమాస్, హిజ్‌బొల్ల మిలిటెంట్లు..కీలక సమాచారం పంచుకునేందుకు పేజర్లు, వాకీటాకీలు వినియోగిస్తున్నారు. సెల్‌ఫోన్లను ఇజ్రాకెల్ ట్రాక్ చేస్తుండడంతో మిలిటెంట్లు పేజర్లతో సమాచారం మార్చుకుంటున్నారు. కీలక అంశాలు పంచుకుంటున్నారు. దాడులు విషయం ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ టార్గెట్ చేయాలనే విషయాలను నిర్ధారించుకుంటున్నాయి. యుద్ధ వ్యూహాలను కూడా పరస్పరం పంచుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఇజ్రాయెల్ ఇంటిలిజెన్స్.. ఎలక్ట్రానిక్ యుద్ధానికి తెరలేపింది. హామాస్, హిస్‌బుల్లాకు సరఫరా చేస్తున్న పేజర్లు, వాకీటాకీలను గుర్తించిన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్.. మార్గమధ్యంలో వాటిలో పేలుడు పదార్థాలను ఫిల్‌చేసి పంపుతోంది. అత్యాధునిక సాంకేతిక సహాయంతో అవి ఏకకాలంలో పేలేలా చేసినట్లు హిజ్‌బొల్లా భావిస్తోంది. రెండు రోజుల క్రితం లెబనాన్‌లో ఏకకాలంలో వేలాది పేజర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో 9 మంది మరణించారు. 3 వేల మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన మరువక ముందే.. తాజాగా వాకీటాకీ పేలాయి. లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఈ పేలుళ్లు జరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ పరిరకాలు పేలాయని, ఈ ఘటనల్లో 100 మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
14 మంది మృతి..
వాకీటాకీలు పేలిన ఘటనలో 14 మంది మరణించగా, 450 మంది గాయపడ్డారని లెబనాన్ ప్రకటించింది. ఇది ఇజ్రాయెల్ పనిగానే భావిస్తున్నామని వెల్లడించింది. సోలార్ ప్లేట్లను కూడా పేలుళ్లకు ఉపయోగించుకున్నట్లు తెలిపింది. మరోవైపు తీర ప్రాంతంలోని సిడోన్‌లో కారుతోపాటు, ఓ షాపులో పేలుళ్లు జరిగాయి. బీరుట్‌లోని పలు సౌర పరికరాలూ పేలిపోయాయి. హిజ్‌బొల్లా గ్రూపులు వినియోగించే రేడియోలు కూడా పేలాయి.
జపాన్‌లో తయారీ…
హిజ్‌బొల్లా వినియోగించే పేజర్లు తైవాన్‌లో తయారవగా, లెబనాన్‌లో పేలిన వాకీటాకీలు జపాన్‌లో తయారయ్యాయి. వాటిపై ఐకామ్ అని ఉంది. ఐకామ్ అనేది రేడియో కమ్యూనికేషన్స్, టెలిఫోన్ల కంపెనీ, అయితే లెబనాన్‌లో వాకీటాకీల ఉత్పత్తిని ఎప్పుడో నిలిపివేశామని ఐకామ్ గ్రూపు తెలిపింది. చేతిలో ఇమిడే రేడియో కమ్యూనికేషన్ పరికరాలను హిజ్‌బొల్లా 5 నెలల క్రితం కొనుగోలు చేసింది.
సరిహద్దుల్లో ఇజ్రాయెల్ సైన్యం..
ఇదిలాఉంటే.. హిజ్‌బొల్లా హెచ్చరికల నేపథ్యంలో యుద్ధం తప్పదని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ క్రమంలో సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది. ఈ సమయంలో సైన్యానికి మరింత ధైర్యం, అంకితభావం అవసరమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్‌గాలెంట్ తెలిపారు. ఇదిలా ఉంటే పేజర్ల పేలుడు శాంతి ప్రయత్నాలకు విఘాతమే అని అమెరికా ప్రకటించింది. మరోవైపు గాజాతోపాటు, ఆక్రమిత వెస్ట్ బ్యాంకును ఇజ్రాయెల్ ఖాలీ చేయాలని పాలస్తీనా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఆమోదించింది. 193 సభ్య దేశాల్లో 124 అనుకూలంగా, 14 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. భారత్‌తోపాటు 43 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు.