https://oktelugu.com/

Crime News : తనకంటే చిన్న వాడితో ప్రేమాయణం.. ఓయో హోటల్ లో రూం బుకింగ్.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్

వివాహేతర సంబంధాలు చాలా వరకు ఎక్కువ రోజులు కొనసాగవు. ఈ విషయంలో ఇద్దరి వ్యక్తుల మధ్య విభేదాలు వచ్చి ప్రాణాలు పోయిన సంఘటనలు అనేకంగా బయటపడ్డాయి. అయితే దురదృష్టవశాత్తూ ఇలాంటి సంఘటనల్లో ఎక్కువగా మహిళల ప్రాణాలే పోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : September 19, 2024 / 12:29 PM IST

    Crime News

    Follow us on

    Crime News :  కాలం మారుతున్న కొద్దీ మనుషుల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోతున్నాయి. అమ్మాయిలు, అబ్బాయిల్లో కొందరు వింత కోర్కెలతో ఉండడంతో చేయరాని పనులు చేస్తున్నారు. దీంతో ఇవి బెడిసి కొట్టి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈమధ్య వివాహేతర సంబంధాల గురించి వార్తలు ఎక్కువగా వినాల్సి వస్తోంది. అంతేకాకుండా కొందరు పెళ్లికాకుండానే రాంగ్ కనెక్షన్ తో లైఫ్ ను నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు వివాహం జరిగి, కుటుంబమంతా ఉన్నా.. వేరొకరితో సంబంధాలు పెట్టుకుంటున్నారు. అయితే ఇవి తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చినా.. ఆ తరువాత సంబంధాలు చెడిపోతున్నాయి. తాజాగా ఓ మహిళ తనకంటే చిన్న వయసు ఉన్న వ్యక్తితో రిలేషన్ షిప్ మెయింటేన్ చేసింది. కానీ చివరికి ఆమె ప్రాణాలు పోయాయి.. అసలేం జరిగిందంటే?

    వివాహేతర సంబంధాలు చాలా వరకు ఎక్కువ రోజులు కొనసాగవు. ఈ విషయంలో ఇద్దరి వ్యక్తుల మధ్య విభేదాలు వచ్చి ప్రాణాలు పోయిన సంఘటనలు అనేకంగా బయటపడ్డాయి. అయితే దురదృష్టవశాత్తూ ఇలాంటి సంఘటనల్లో ఎక్కువగా మహిళల ప్రాణాలే పోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.

    ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగ్ నగర్ మండలం గోపాల్ భరి గ్రామానికి చెందిన సుమన్ దేవి సరాయ్ అనే మహిళ కు బల్కరన్ పూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో విహం జరిగింది. అయితే కొన్నాళ్ల పాటు బాగానే కలిసి ఉన్న వీరు కొన్ని కారణాల వల్ల విడిపోయారు. దీంతో ఆ సుమన్ దేవి సరాయ్ తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటోంది. అయితే ఈ క్రమంలో వివేక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తరుచూ వీరిద్దరు పార్కుల్లో, ఇతర ప్రదేశాల్లో కలుసుకునేవారు. అయితే ఈ ఆదివారం ఓయో ఓటల్ లో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.

    ఈ క్రమంలో సారావ్ గ్రామంలోని ఓయో హోటల్ లో కలుసుకున్న తరువాత దేవి సరాయ్ తనను పెళ్లి చేసుకోవవాలని వివేక్ ను అడిగింది. అయితే పెళ్లికి తాను నిరాకరించాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య చిన్న గొడవ ప్రారంభమై తారాస్థాయికి చేరింది. చివకు తనను పెళ్లి చేసుకోకపోతే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో తీవ్రంగా కోపం తెచ్చుకున్న వివేక్ ఆగ్రహంతో ఆమెపై దాడి చేశాడు. ఈ క్రమంలో సుమన్ దేవీ రాయ్ ప్రాణాలు విడిచింది. అయితే ఆ తరువాత వివేక్ వెంటనే పోలీసులకు లొంగిపోయి విషయమంతా చెప్పాడు.

    ఆ తరువాత పోలీసులు కేసు నమోదు చేసుకొని ఓయో హోటల్ లోని రూం ను పరిశీలించారు. దేవి సరాయ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పటించారు. ఆ తరువాత వివరాలను మీడియాకు చెప్పారు. తల్లిదండ్రుల ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఈమె వివేక్ తో సంబంధాలు కొనసాగించారని, ఆ తరువాత వీరి మధ్య విభేదాలు రావడంతో హత్య చేశారని పోలీసులు తెలిపారు. అయితే ఇలాంటి సంఘటనపై పలువురు చర్చించుకుంటున్నారు. వివాహేతర సంబంధాల వల్ల జీవితాలు నాశనం అవుతాయని, ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిదని అంటున్నారు.