WPL 2025 : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women’s premier league 2025) 2025 సీజన్ ను డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. గుజరాత్ జెయింట్స్(Gujarat Jaints) తో శుక్రవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సాధించిన విజయంలో ఆ జట్టు ప్లేయర్ రీచా ఘోష్(Richa Ghosh) కీలక పాత్ర పోషించింది. 27 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. రిచా దూకుడు నేపథ్యంలో బెంగళూరు ఓడిపోయే మ్యాచ్ లో గెలుపును దక్కించుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. గుజరాత్ జట్టులో కెప్టెన్ అష్లే గార్డ్ నర్(79*) మెరుపు ఇన్నింగ్స్ తో అదరగొట్టింది. బెత్ మూనీ(56) హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నది. డియెండ్రా డాటిన్(25) పరుగులతో ఆదరగొట్టింది. బెంగళూరు బౌలర్లలో రేణుకా సింగ్ రెండు వికెట్లు సాధించింది. కనిక, జార్జియా, ప్రేమ తలా ఒక వికెట్ పడగొట్టారు. గుజరాత్ విధించిన 202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 18.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లకు 202 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి (9), డానీ వ్యాట్(4) చేతులెత్తేసినప్పటికీ.. ఎల్లిస్ ఫెర్రీ (57), రిచా ఘోష్(64*) హాఫ్ సెంచరీలతో కదం తక్కువడంతో బెంగళూరు అద్భుతమైన విజయం సాధించింది.. కనిక (30*) మెరుపులు మెరిపించడంతో బెంగళూరు జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. గుజరాత్ బౌలర్లలో అష్లే గార్డ్ నర్ రెండు వికెట్లు సాధించింది. డియాండ్రా డాటిన్, సయలి తలా ఒక వికెట్ పడగొట్టారు.. ఒకానొక దశలో బెంగళూరు 109 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి.. ఓటమి వైపు ప్రయాణించింది. ఈ దశలో రిచా, కనిక బెంగళూరు జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్ కు ఏకంగా 93 పరుగుల జోడించారు. ఓడిపోయే మ్యాచ్లో బెంగళూరుకు అద్భుతమైన విజయాన్ని అందించారు.
అనేక రికార్డులను బద్దలు కొట్టింది
ఓపెనింగ్ మ్యాచ్లో బెంగళూరు అనేక రికార్డులను బద్దలు కొట్టింది. 202 పరుగుల టార్గెట్ చేదించి ప్రపంచ రికార్డును సృష్టించింది. మహిళల దేశవాళి/ ఫ్రాంచైజీ క్రికెట్లో అత్యధిక రన్ చేజ్ చేసిన జట్టుగా బెంగళూరు నిలిచింది.. ఇక ఈ మ్యాచ్లో రెండు జట్టు కలిపి 403 పరుగులు చేశాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇదే హైయెస్ట్ స్కోర్. ఈ మ్యాచ్లో రెండు జట్లకు చెందిన ప్లేయర్లు పోటాపోటీగా 16 సిక్సర్లు కొట్టడం విశేషం. లీగ్ చరిత్రలో ఇది రెండవ అత్యధికం. ఇక గతి సీజన్లో బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 19 సిక్సర్లు నమోదయ్యాయి.